
Talking Style
ఒక సారీ విక్రమాదిత్య మహారాజు తన మంత్రి, సైన్యముతో అడవికి వేటకు వెళ్ళాడు. వేటాడే క్రమంలో ఒకరికొకరు తప్పిపోయారు. దూరంగా ఒక చెట్టు నీడలో కూర్చొని ఉన్న అంధుడైన ఒక వృద్ధుడైన సాధువు కనపడగ అతని దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు ” సాధు మహారాజ్ గారికి మా ప్రణామములు..ఇటు వైపు గా ఎవరైనా వెళ్లినట్టు మీకు అనిపించిందా”..అప్పుడు ఆ అంధుడైన సాధువు ఇలా అంటున్నాడు ” మహారాజ! అందరికంటే ముందు మీ సేవకుడు తరువాత మీ సేన నాయకుడు ఆ తరువాత మీ మంత్రి గారు కూడా ఇటు వైపు ఇంతకుముందే వెళ్లారు”
అంధుడైన ఆ సాధువు చెప్పిన జవాబుకు ఆశ్చర్యుడైన ఆ మహారాజు సాధువు తో ఇలా అంటున్నాడు ” మహాత్మా! మీకు రెండు కళ్ళు కనపడదు కదా మరి నేను మహారాజు అని వాళ్ళు నా సైనికులు, సేనానాయకుడు, మంత్రి గారు అని ఎలా తెలుసుకోగాలిగావు”
దానికి ఆ సాధువు చిరునవ్వు నవ్వి ఇలా చెప్తున్నాడు –” మహారాజ నేను మీ మాటలు బట్టి కనిపెట్టాను. అందరికంటే ముందు మీ సేవకుడు వచ్చి నాతో – ” ఏమి రా గుడ్డివాడ! ఇటు వైపు ఎవరైనా వచ్చారా?” అని అడిగాడు…కొంతసేపటికి మీ సేనానాయకుడు వచ్చి ” సూరదాస్! ఇటు ఎవరైనా వెళ్ళరా?” అని అడిగాడు, చివరికి మీ మంత్రి వచ్చి ” సూరదాస్ జీ! ఇటు ఎవరైనా వెళ్లారా ?” అని అడిగాడు. “మహారాజ! ఒక వ్యక్తీ యొక్క వాక్కు ద్వార అతని పదవి, ప్రతిష్ఠ ఏమిటో గుర్తించవచ్చు.”