వేంకటేశ్వరుని సేవలో తరించిన తరిగొండ వెంగమాంబ | Story of Tarigonda Vengamamba In Telugu

0
5318

10805668_1513131202269377_6919814501909309248_n

1531731_1513146665601164_4138170967157171450_n
Story of Tarigonda Vengamamba In Telugu

Story of Tarigonda Vengamamba In Telugu

వెంగమాంబ చిత్తూరు జిల్లా, గుర్రంకొండ మండలములోని తరిగొండ గ్రామములో వాసిష్ఠ గోత్రీకుడైన కావాల కృష్ణయ్య, మంగమాంబ అను నందవారిక బ్రాహ్మణ దంపతులకు 1800ల ప్రాంతములో జన్మించినది.

వెంగమాంబ బాల్యములో తన తోటి పిళ్లవాళ్లలాగా ఆటలాడుకోక ఏకాంతముగా కూర్చొని భక్తి పారవశ్యముతో మునిగితేలేది. ఆ చిరు ప్రాయములోనే అనేక భక్తి పాటలను కూర్చి మధురముగా గానము చేసేది. తండ్రి ఆమె భక్తిశ్రద్ధలను గమనించి ఆమె నైపుణ్యమును సానబెట్టుటకు సుబ్రహ్మణ్య దీక్షితులు అనే గురువు వద్దకు శిక్షణకు పంపినాడు. దీక్షితులు ఆమె ప్రతిభను గుర్తించి తనకు తెలిసిన పరిజ్ఞానమంతా వెంకమాంబకు భోధించినాడు. అనతి కాలములోనే వెంకమాంబ ప్రశస్తి నలుమూలల పాకడముతో తండ్రి ఆమె విద్యాభ్యాసమును మాన్పించి తగిన వరునికోసము వెతకడము ప్రారంభించాడు.

తల్లి వెంగమాంబను ఇంటి పనులలో సహాయము చేయమని కోరగా తన సేవ భగవంతునికే అర్పణమని వెంకమాంబ తిరస్కరించినది. అనేక మంది వరులు ఆమెను చూచి చాలా అందముగా ఉన్నదనో, చాలా తెలివైనదనో నెపములతో పెళ్లి చేసుకొనుటకు సమ్మతించలేదు. చివరకు ఇంజేటి వెంకటాచలప్ప ఆమె అందమును చూసి ముగ్ధుడై ప్రేమలో పడి వెంకమాంబను వివాహమాడుటకు అంగీకరించాడు. తండ్రి ఆమెకు మంచిభార్యగా మసలుకోమని హితవు చెప్పి వివాహము జరిపించినాడు. వివాహానంతరము వెంకటాచలప్ప ఆమె భక్తి మౌఢ్యాన్ని వదిలించ ప్రయత్నము చేసినాడు కానీ వెంకమాంబ అతనిని దగ్గరికి రానివ్వలేదు.

ఈమె తిరుమలలో ఆలయానికి ఉత్తరాన 15 కి.మీ. దూరాన దట్టమైన అడవులలో తుంబురు కోన వద్ద యోగాభ్యాసం చేస్తూ గడపినట్లు తెలుస్తున్నది. ఈమెకు వేంకటేశ్వరుడు కలలో కనుపిస్తూ ఉంటాడని అనేవారు. తిరుమలలో ఉత్తర వీధిలో ఉత్తర దిశలో ఉన్న వనంలో (ప్రస్తుతం ఉన్న ఒక పాఠశాలలో) ఈమె సమాధి ఇప్పటికీ ఉన్నది. ఈమె ప్రతిరాత్రి ఊరేగింపుగా తన ఇంటిముంగిటికి వచ్చే భోగ శ్రీనివాసమూర్తికి వెండి పళ్ళెంలో ముత్యాల హారతి ఇస్తూ ఉండేదట. ఇందుకోసం ఒక్కొక్కదినం నగిషీలు చెక్కబడిన వెండిపళ్ళెంలో ఒక్కొక్క దశావతార ఘట్టాన్ని సమర్పించేదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here