తెలంగాణ అమర్నాథ్ యాత్ర గురుంచి మీకు తెలుసా?! 2023 జాతర తేదిలు ఖరారు

0
974
Saleshwaram Lingamayya Jatara 2023
Saleshwaram Lingamayya Jatara 2023 Details

Saleshwaram Lingamayya Jatara 2023

1సలేశ్వరం జాతర

తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అమర్నాథ్ యాత్రగా ప్రఖ్యాతిగాంచిన సలేశ్వరం జాతర. ఈ జాతర ఈ నెల 5, 6, 7వ తేదిలలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు తగ్గట్టుగా రెవెన్యూ అధికారులు, ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఈ జాతరను ఎందుకు తెలంగాణ అమర్నాథ్ యాత్ర అంటారు అంటే ఎత్తైన కొండలు, జాలువారే జలపాతాలు, ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా ఉండే నల్లమల అటవీ ప్రాంతంలో కొలువుదీరిన సలేశ్వరం లింగమయ్య దర్శనం చేసుకోవాలంటే అమర్నాథ్ యాత్రలా ఎంతో సాహసం చేయాల్సిందే. అందుకే ఈ జాతరకు ఆ పేరు వచ్చింది.

సలేశ్వరం ప్రకృతి అందాలు (Natural Beauty of Saleswaram)

కిలోమీటర్ల మేర కాలినడకన అడుగులు వేస్తూ, రాళ్లు రప్పలు దాటుతూ, కొండలు ఎక్కి దిగుతూ, సహజసిద్ధంగా వెలసిన జలపాతాలను దాటుకొని, పున్నమి వెన్నెల్లో స్వామి సన్నిధికి చేరుకోవాల్సి ఉంటుంది. అడవి లోయలో ప్రతిధ్వనించే లింగమయ్య నామస్మరణం దారి పొడవున పడే నీటి తుంపర్లు వెయ్యి అడుగులపై నుంచి జాలువారే జలపాతం ఇలా ఒక్కొక్క దృశ్యం రమణీయత తొణికిసలాడుతుంది.

Back