
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
Ethics Of Fisherman
చేసిన తప్పుకు శిక్ష తప్పించుకోవాలనే అనుకుంటాం అందరం. నీతిగా మనం చేసిన తప్పులకు శిక్ష అనుభవించడమే న్యాయమని భావించేవారు చాలా అరుదు.
అలా తప్పును అంగీకరించడం వల్ల న్యాయం నిలబడుతుంది. మనకు ఎల్లప్పుడూ బలాన్ని చేకూర్చేది న్యాయమే. అలా న్యాయాన్ని అంగీకరించిన జాలరుల కథ తెలుసుకుందాం.
1. జాలరుల పొరపాటు
భృగు మహర్షి కుమారుడు, ఆయుర్వేద పండితుడు అయిన మహా తేజోశాలి చ్యవనుడు పన్నెండు సంవత్సరాలపాటు గంగాయమునా సంగమ జలాలలో మునిగి తపస్సు చేశాడు.
ఆ సమయం లో విధివశాత్తు ఆయన జాలరుల వలలో చిక్కినాడు. చ్యవనుని చూసిన జాలరులు ఎంతగానో పశ్చాత్తాపపడి, ఆయనను క్షమించమని కోరినారు.
శాంత మూర్తి అయిన చ్యవనుడు జరిగిన సంఘటనలో వారి తప్పేమీ లేదని వారు కేవలం తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారని అన్నాడు. అంతేకాదు వలలో చిక్కిన తనను కూడా ఆ చేపలతో పాటుగా విక్రయించి డబ్బును తీసుకో’మని అన్నాడు.
మహర్షి మాటలకు ఆశ్చర్యపోయిన ఆ జాలరులు తమ తప్పును మహారాజైన నహుషునికి విన్నవించుకున్నారు.
Sir santhanam kosam emi pujalu cheyali
Karkata rasi, Pushyami Nakshatram