
Goddess saves From Sarpadosham in Telugu
మానసాదేవి మహాశివునికి మానస పుత్రిక. ఆమె నాగమాత అయిన కద్రువకు కశ్యప ముని కి జన్మించింది.
పరమేశ్వరుడు సాగర మథనం లో పుట్టిన హాలాహలాన్ని మింగినపుడు ఆయనకు ఆ హాలాహలం హాని చేయకుండా కాపాడింది మానసాదేవి.
పరమేశ్వరుడు తన పుత్రిక అయిన మానసా దేవి పై చూపించే ప్రేమకు అసూయపడి చండిక ఆమెను ద్వేషించేది. పరమేశ్వరుని తండ్రిగా భావించిన మానస కు చండీ మాత(పార్వతి) తల్లి ప్రేమను పంచలేక పోవడం తో ఆమె నిరాశపడింది.
ఇటు కశ్యపుడు కద్రువ ఆమె తలిదండ్రులే అయినా ఆమెను శివుని మానస పుత్రికగానే చూసేవారు. తలిదండ్రుల ప్రేమను పొందలేని మానసాదేవి తనను పూజించని వారిని శపించేది. ఆమెను పూజించిన వారిని ఎల్లవేళలా కాపాడేది. అందుకని దేవతలంతా ఆమెను పూజిస్తారు.
ఆమెకు జరత్కారు అన్న పేరు కూడా ఉంది. అదే పేరున్న జరత్కారు ముని ఆమెను వివాహం చేసుకున్నాడు.
తన సేవలో మానసాదేవి అశ్రద్ధ చేసిందని చిన్నతప్పుకి ఆమెను బహిష్కరించగా ఆమె తపస్సు లో లీనమై పరమ శివుని ధ్యానించింది. ఆమె పరమేశ్వరుని పుత్రిక మాత్రమే కాదు ప్రియశిష్యురాలు కూడా.
సర్పదోషాలు రాకుండా, సర్పాలు హాని చేయకుండా, ఒకవేళ పాము కాటువేసినా ఆ విషం హాని చేయకుండా మానసాదేవి కాపాడుతుంది.
బ్రహ్మ పురాణం లోనూ మహాభారతం లోనూ ఈమెను గురించిన కథ ఉంటుంది. జానపద కథలలో కూడా మానసాదేవి గురించి అనేక రకాల కథనాలు కనిపిస్తాయి.
నమ్మికొలిచిన భక్తులకు మానసాదేవి సులభసాధ్య. సిరిసంపదలను, పుత్రపౌత్రాదులనూ ఇచ్చి ప్రమాదాలనుంచీ, విషం నుంచీ ముఖ్యంగా పామూకాట్ల నుంచీ కాపాడుతుంది.
ఉత్తరాఖండ్ ప్రాంతం లోని హరిద్వార్ పుణ్య క్షేత్రం లో బిల్వ పర్వత శ్రేణులలో మానసాదేవి ఆలయం దర్శనమిస్తుంది.
Very brief notes about devotion ethics