ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు ? | Ayurveda Health Tips in Telugu

0
3868

Ayurveda Health Tips in Telugu  / ఆయుర్వేద గ్రంధాలలో చెప్పబడిన రహస్య ఆరోగ్య సూక్తులు ?

రహస్య సూక్తులు

 • రాత్రి యొక్క ఆఖరి ఆయామం అనగా బ్రహ్మముహూర్తం నందు నిద్ర నుండి మేల్కొనవలెను.
 • ఉదయం , సాయంసమయం నందు స్నానం ఆచరించవలెను.
 • మలమూత్ర మార్గములను , పాదములను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకొనవలెను.
 • నిత్యం శిరస్సు , ముక్కు, పాదముల యందు తైలము ను ఉపయోగించుకొనవలెను
 • వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమములు 15 రోజులకు మూడుసార్లు హరించవలెను
 • పితృదేవతలకు పిండప్రదానం చేయువాడిగా ఉండవలెను.
 • భయము లేకుండా దైర్యవంతునిగా ఉండవలెను . భయము కలుగుటచే రోగములు ఉద్భవించును.
 • గొడుగు, తలపాగా, కర్ర సహాయంగా ఉంచుకొనుము . కొండలు ,సంచారం లేని ప్రదేశం నందు ఒంటరిగా ఇవి లేకుండా సంచరించరాదు.
 • శ్రమ చేయుటకు ముందు శరీరముకు విశ్రాంతి ఇవ్వుము.
 • ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయవలెను.
 • రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం.
 • అజీర్ణం చేయుట , తినినవెంటనే మరలా తినుట వలన గ్రహణి వ్యాధికి కారణం అగును.
 • కాలంకాని కాలము నందు ఆహారాం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడును.
 • అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకొనవలెను. ఎల్లప్పుడూ ఒకేరూచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
 • ఆహారం అతిగా తీసుకోవడం వలన ఆమము శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును.
 • విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
 • పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
 • మజ్జిగ భోజనం చేసినతరువాత ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయను , విరుద్ద ఆహారపదార్థాలు తీసుకోవడం వలన కలుగు విషములను , గ్రహణి , మొలలు మొదలగు రోగములను నివారించును . పెరుగు నందు నాలుగోవ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను తక్రమగును .ఇది అత్యంత గుణకారి.
 • ప్రతి ఉదయం నోటి యందు నువ్వులనూనె పొసుకొని తెల్లటి నురుగు వచ్చేవరకు పుక్కిలించి బయటకి విడువవలెను. దీనిని దంతధావనం చేయుటకు పూర్వం చేయవలెను. ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివలన దంతములు కు బలం కలుగును.దంతవ్యాధులు రానివ్వదు. నములువానికి రుచి తెలియును.
 • రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం.
 • అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం.
 • వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది.
 • నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
 • పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి.
 • ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం.
 • దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం.
 • ఫలములలో ద్రాక్ష శ్రేష్టం.
 • ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం.
 • చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం.
 • మినుములు అతిగా వాడరాదు.
 • వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
 • చవిటి ఉప్పు మంచిది కాదు.
 • గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
 • పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
 • దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
 • మలమూత్ర వేగములను ఆపరాదు.
 • ఆహారం అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారమని ద్రవరూపంలో మార్చి అరిగించును.
 • హృదయముకి మేలు చేయటంలో ఆమ్లరసం శ్రేష్టమైనది.
 • స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది.
 • విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
 • గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి.
 • ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును.
 • నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును.
 • నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును.
 • తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును.
 • కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
 • ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును.
 • ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును.
 • మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును.
 • అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం.
 • నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు.
 • పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు.
 • స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
 • ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును.
 • బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును.
 • నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
 • గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను.
 • మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు.
 • పిల్లలు , ముసలివారు , మూర్ఖులు , నపుంసకులు వీరితో ఎల్లప్పుడు సఖ్యం చేయరాదు.
 • సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు.
 • రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
 • మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు.
 • స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు.
 • బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు.
 • నొటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు.
 • భూమిని గీయకూడదు , గడ్డి తుంచకూడదు.
 • మట్టిబెడ్డలు చేతితో నలపకూడదు.
 • అవయవములతో విషమమగు చేష్టలు చేయరాదు.
 • ముక్కుతో శబ్దం చేయకూడదు.
 • పళ్ళు కొరకకూడదు
 • పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతుంటాయి . ఈ రోజు మీరు తీసుకున్న ఆహారం యెక్క రస ప్రభావం 40 రొజుల వరకు మీ శరీరం పైన ఉంటుంది. అందుకే దీక్షలు మండలం రోజులు ఉంటాయి . మండలం అనగా ఆయుర్వేద శాస్త్ర ప్రకారం 40 రోజులు . ఈ 40 రొజులు శుద్ధమైన ఆహారం , సాత్విక ఆహారం తీసుకొనడం వలన శరీరం శుద్ది అవుతుంది. అదేవిదంగా ప్రతి 28 రోజులకి మనిషి రక్తంలో మార్పు సంభంవించును . పాము కుబుసం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు . వాటిని మృతకణాలు అంటారు. ఆంగ్లము నందు Dead Skin Cells అంటారు. ఇవి అత్యంత సూక్ష్మరూపంలో ఉంటాయి. వీటిగురించి ఆయుర్వేదం ఎప్పుడో వివరించింది. రక్తం నందు మర్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. వొళ్ళు విరవడం ఎక్కువుగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాలలో నిగూఢముగా ఉన్నాయి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here