దీపం వెలిగించడంలో అంతరార్థమేమిటి? | Significance of Lighting oil lamps in Telugu

2
22356
diya
దీపం వెలిగించడంలో అంతరార్థమేమిటి? | Significance of Lighting oil lamps in Telugu

దీపం వెలిగించడంలో అంతరార్థమేమిటి? | Significance of Lighting oil lamps in Telugu

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం

దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే

అంటుంది శాస్త్రం. దీపారాధన ద్వారా అన్నీ సాధ్యమవుతాయని చెబుతుంది పై శ్లోకం. దీపమే పరబ్రహ్మమంటుంది. తామస గుణాలను తరిమేసేది దీపమేనంటుంది.

ఒక చిన్న దీపం ఇన్ని మహిమలను ఎలా కలిగి ఉంటుందో తెలుసా? ఎందుకంటే దీపం యొక్క ప్రతిభాగంలో దేవతలు నివాసముంటారు కాబట్టి. జంట వత్తులతో వెలిగించిన చిన్న దీపం నుంచీ ఐదు వత్తుల దీపాల వరకూ అన్నీ పవిత్రమైనవే, సర్వ శుభాలనూ కలిగించేవే. దీపం యొక్క భాగాలలో ఎక్కడెక్కడ ఏ యే దేవతలు నివాసముంటారో చూద్దాం.

దీపం అడుగుభాగంలో పరబ్రహ్మ, దీపం మధ్య భాగంలో వేంకటేశ్వరుడు, నూనె లేదా నెయ్యి నిండిన భాగంలో రుద్రుడు, వత్తి ఎక్కడైతే కుదురుగా సర్డుకుంటుందో ఆ భాగంలో మహేశ్వరుడు, వత్తి యొక్క వెలిగే భాగంలో సదాశివుడు నివాసముంటారు. ఈ మొత్తం కలిపి లక్ష్మి, సరస్వతి, దుర్గ ఈ ముగ్గురూ కలిసిన ఆది శక్తి స్వరూపం. ఒక్క చిన్న దీపం వెలిగించి ఏకాగ్రచిత్తంతో, భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి. అంతులేని పుణ్యం లభిస్తుంది. దీపాన్ని వెలిగించడమంటే బాధలను తరిమేసి బ్రహ్మానందాన్ని మనసా వాచా కర్మణా ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని తరిమేసి జ్ఞానాన్ని సంపాదించాలంటే శ్రీ రాజరాజేశ్వరి అంశ అయిన దీపలక్ష్మిని పూజించాల్సిందే.

దీపారాధన చేయడం ద్వారా కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. జన్మ సాఫల్యం చేకూరుతుంది.

శుభం భూయాత్. జై మహా కాళి. _/\_

2 COMMENTS

  1. Namaskaram.
    Deeparadhana pramidalalo nune(oil) enta parimanam lo veyyali(ninduga,madyastanga).
    pramida lo migipoyina oil to tirigi deeparadhana cheyavacha.samadhanam ivvagalaru. _/\_

    • దీపారాధన పూజలో ముఖ్యమైనదైనా, నూనె మనకు ప్రకృతి నుంచీ వస్తుంది కాబట్టి దానిని వృధా చెయ్యకూడదు. దీపంలో కొంచెం నూనె మిగిలినా తప్పేమీ లేదు. నిరభ్యంతరంగా మళ్ళీ ఇంకొంచెం నూనె వేసి దీపం వెలిగించవచ్చు. ఇకపోతే ప్రమిదెలో తగినంత నూనె వేసుకోవాలి. నూనె పరిమాణానికి నిబంధనలేవీ లేవు.

      శుభమస్తు. దేవీ కృపాకటాక్ష ప్రాప్తిరస్తు. _/\_

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here