కన్నె తులసమ్మ నోము కథ

0
1176

కన్నె పిల్లలు జరుపుకునే ప్రధానమైన నోములలో ‘కన్నె తులసి నోము‘ఒకటి. ఈ నోము ఆరోగ్యాన్ని … ఆయుష్షును … వివాహానంతరం చక్కని సౌభాగ్యాన్ని ఇస్తుంది. కష్టాల నుంచి … కన్నీళ్ల నుంచి గట్టెక్కిస్తుంది. ఈ నోము కన్నెపిల్లలు నోచుకోవడానికి వీలుగా … తేలికగా ఉంటుంది.

ప్రతి నిత్యం ఉదయాన్నే స్నానం చేసి తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు … మూడు నమస్కారాలు చేసి అక్షింతలు తలపై వేసుకోవాలి. ఈ విధంగా ఏడాది పాటు తులసిని పూజించాక, 26 జతల అరిసెలు చేయించి 13 జతల అరిసెలను నైవేద్యంగా పెట్టాలి. ఓ కన్నె పిల్లకు కొత్త బట్టలు పెట్టి, మరో 13 జతల అరిసెలను వాయనమివ్వాలి. నైవేద్యంగా పెట్టిన అరిసెలను తన ఈడు పిల్లలతో కలిసి తిన్న తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది.

ఇక ఈ నోము నోచుకోవడం వెనుక ఓ కథ వుంది.

ఒక బ్రాహ్మణునకు మొదటి భార్య కూతురుంది. రెండవ భార్య ఈ అమ్మాయిని అనేక బాధలు పెట్టేది. అందుచేత ఆమె సవతితల్లి బాధ పడలేక తాతగారింటికి వెళ్ళి పోయింది. కొంతకాలం జరిగిన తరువాత సవతితల్లి భర్తను చూచి మనపాపను చూచి చాలాకాలమయింది. తీసికొని రమ్మనగా అతడు నేను వెళ్ళను. నీవే వెళ్ళమనగా ఆమె పాప తాతగారంటికి వెళ్ళి వారిని బ్రతిమాలి కూతురును తీసికొని వచ్చింది. యిలా కొంతకాలం జరుగగా ఒక రోజు తులసీ పూజ తల్లి చేయుచూ అరిశ నైవేద్యం పెట్టింది. తరువాత యీపాపకు సగం అరిశ యిచ్చింది. ఆ పాప తల్లి యిచ్చిన సగం అరిశ నైవేద్యం పెట్టి తులసమ్మను ప్రార్థించింది. అప్పుడా తులసమ్మ ఆమెకు ప్రత్యక్షమై నీవు కన్య తులసమ్మ నోముపట్టి నియమం తప్పావు. అందువలననే నీ తల్లి చనిపోయి నీకి బాధలు కలిగాయి అని చెప్పింది. 

ఆ మాటలు విని ఒక సంవత్సరం కన్నెతులసమ్మ నోము ఆ పాపపట్టింది. అప్పుడు సవతితల్లికి ఆమెపై ఎంతో ప్రేమ కలిగింది. ఆ విధముగా ఆ పాప ఆ వ్రతం చేసింది.

అట్లతద్ది నోము ఎందుకు చేస్తారు? | Atla Taddi 2020 Telugu