
అజరామరమైన ఇతిహాస భారతాన్ని భారతీయులకు అందించిన మహర్షి వేదవ్యాసుడు. కేవలం ఒక వౌనిగా, మహర్షిగా కాకుండా, అంతకు మించిన గౌరవం అందుకున్నవాడు.
విశ్వామిత్రుడు, వశిష్టుడు, వాల్మీకి ఎందరున్నా, వ్యాసుడు పొందిన ప్రాశస్త్యం ప్రత్యేకమైనది. అంతటి ప్రశస్తి పొందిన వేదవ్యాసునకు చిక్కమంగళూరు జిల్లా శృంగేరి నరసింహ వనంలో ప్రత్యేకంగా ఓ మందిరం వుంది.
తుంగ భ్రదా నది కుడి పక్కన అష్టకోణాకృతిలో నిర్మితమైన ఈ ఆలయం భక్తులకు కనువిందుచేస్తోంది. లోక కల్యాణకారుడైన మహర్షికి మందిరం నిర్మించిన కీర్తి కర్ణాటకదే.
1. మందిర అంకురార్పణ
వేద వ్యాసునకు మందిరం నిర్మించాలని ఆలోచనకు అంకురార్పణ చేసింది బెంగుళూరుకు చెందిన కుప్పాచారి కృష్ణమూర్తి.
ఆయన తన మదిలో రేగిన ఆలోచనను, తదనుగుణంగా రేగిన ఆకాంక్షను శృంగేరీ మఠ భారతీ తీర్థ స్వామీజీకి వివరించగా, ఆయన నరసింహ వనంలో వ్యాసఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలా వేదవ్యాస జ్ఞానపీఠ నిర్మాణం మొదలైంది.
శంకారా చార్యులచే నిర్మితమైన శృంగేరీపీఠం ఇక్కడి శంకర మఠం. ఈ నది ఒడ్డున ఉన్న ధ్యానమందిరాలు దర్శించినంతనే, ధ్యానంపైకి దృష్టిని మళ్లిస్తాయ.