సత్వగుణ విశిష్టత

0
1064

సత్వగుణ విశిష్టత

జన్మలన్నింటిలో మానవజన్మ చాలాశ్రేష్టమైనది. ఉత్తములైన మానవులలో ఏన్నో సుగుణాలు కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైంది దానం, దయ, సత్యవాక్కు, పరోప కారం, క్షమ, ఔదార్యం శౌర్య పరాక్రమాలు అని చెప్పవచ్చు.

చతుర్వేదాలు, కావ్యాలు, గ్రంథాలు, పురాణాలు, ఇత్యాదులలో ఈ గుణాల ప్రాశ స్యాన్ని గురించి విపులంగా ఉంది. భగవంతుడు ఏవిధంగా మన అపరాధాలను క్షమి స్తాడో అదేవిధంగా మనం కూడా పరుల తప్పులను క్షమించాలని ప్రాణకోటిపై దయా చూపాలని క్షమయే దానం, క్షమయే సత్యం, క్షమనే యజ్ఞం అనీ క్షమనే ధర్మం అంటూ వాల్మీకి మహర్షి చక్కగా క్షమ గొప్పదనాన్ని రామాయణంలో నిక్షిప్తం చేసారు. ఈ ప్రపంచం మొత్తం క్షమమీదనే నిలచిఉందని అది లేనినాడు ప్రపంచంలో ప్రాణి బతకటం కష్టమన్న సంగతి మనకు రామాయణం ద్వారా తెలుస్తుంది.

స్కందపురాణంలో కోయిల యొక్క వైశిష్ట్యం దాని మధుర కంఠమనీ, స్త్రీ వైశిష్ట్యం ఆమె పాతివ్రత్యంఅనీ, అందవిహీనుల శక్తి వారి విద్య అని అలాగే మనుష్యుల విశి ష్టత వారి క్షమాగుణమని వెల్లడిస్తోంది. క్షమాగుణం గురించి తెలుసుకోవడం ఎంత సులభమో ఆ క్షమాగుణాన్ని ఆచరణలో పెట్టడం అంత కష్టం. ఎందుకంటే మనిషి తాను ప్రేమించిన విషయం ఎపుడైనా మరిచిపోతాడేమో కాని ద్వేషించే గుణాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకొని ఉంటాడు. అందుకే ఆ ద్వేషించేగుణాన్ని దూరం చేసుకో వడం కష్టం అలవర్చుకోవాలన్నది పెద్దల ఉద్భోద.

శక్తిమంతుడిలో అభిమానం, అహంకారం పాలు ఎక్కువైనపుడు కుటుంబాన్ని, సమాజాన్ని, చివరకు దేశాన్ని కూడా ముక్కలు చేయడానికి వెనుకాడడు. అన్నింటా తానే అధికుడన్న అహంకారం ఆ వ్యక్తిని అంధుణ్ణి చేస్తుంది. దారిద్ర్యంలో సంతోషం అనుభవించడం, పిసినారిలో దానశీలత్వం కలిగుండడం ఎంత కష్టమో శక్తిమంతు డిలో క్షమాగుణం కనిపించటం, దానిలో ఆచరణలో పెట్టడం కూడా అంతే కష్టం. కాని క్షమాగుణం లేనివాడే నిజమైన అపరాధి అని గౌతమబుద్ధుడు అంటాడు.

అందుకే క్షమ జీవితాదర్శం కావాలి. అది ధర్మానికి విశ్వమైత్రికి ఆధారం. క్షమా గుణం కలిగిన వ్యక్తి సర్వజీవరాశిచేత కీర్తింపబడుతాడు. దుష్టులు వారి దుశ్చర్యల పట్ల పశ్చాత్తాపం కలిగుంటే వారిని తప్పక క్షమించమని ఏసుప్రభువు చెప్పాడు.

ఒక్క హైందవమే కాక ప్రతి మతమూ ప్రతి గ్రంథమూ క్షమనే మనిషికి అవసరమైన గుణమని ప్రబోధిస్తోంది. భగవంతుని లక్షణం క్షమించడం. మానవులు భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకొంటే, ఆచరణలో పెట్టితే తప్పకుండా క్షమించడం అనేది అలవ ర్చుకోవాలి. అపుడే వారు భగవంతునికి చేరువ అవుతారు. మానవ జీవితంలోరాగద్వే షాలు, క్రోధ లోభాలు, ప్రతీకారం వంటి అమానుషగుణాలు ప్రజ్వరిస్తూ ఉంటాయి. సాధుసజ్జనులు వాటిని అణిచివేసి తమ తమ సత్వగుణంతో క్షమను అలవర్చుకొంటే హింస స్థానంలో అహింసావాతావరణం ఏర్పడుతుంది. క్షమగుణంతో దేశసమైక్య తను నాంది పలుకవచ్చు. దేశాభివృద్ధికి తోడ్పడవచ్చు. పాండవులల్లో ఉన్న క్షమాగుణ వల్లనే దుర్యోధనుడు ఎన్ని తప్పులు చేసినా బతకగలిగాడు. కాని దుర్యోధనునిలో ఉన్న దురాలోచన మాత్రం చివరకు ఆయనకు ప్రాణాన్ని మిగల్చలేకపోయింది. సత్యవాక్కు పరిపాలన, ఓర్పు, సహనం క్షమ ఉండటంవల్ల హరిశ్చంద్రుడు ఆదర్శవ్యక్తిగా నేటికీ కొనియాడబడుతున్నాడు. రామునిలాగా పితృవాక్య పరిపాలన, క్షమాగుణాన్ని ప్రతిమానవుడు అలవర్చుకుంటే మహితోత్తముడిగానే జీవితాన్ని సాగించవచ్చు.

త్యాగం చేసే గుణం, ఇతరులను ప్రేమించే తత్వం, నిజమైన భక్తి ఉన్నవారు భగవంతునికి ఇష్టులౌతారు.

ఎం. శివశంకర శాస్త్రి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here