వాళ్ళు వెనుదిరిగారు..!

0
1952

అయ్యప్ప భక్తులదే విజయం.. అయ్యప్ప స్వామి ఆలయం లోకి ప్రవేశం కోసం ఇద్దరు మహిళలు బయలుదేరారు. కొచ్చికి చెందిన కవిత అనే మహిళతో పాటు, హైదరాబాద్ మోజో టీవీకి చెందిన ఓ మహిళా జర్నలిస్టు భారీ భద్రత మధ్య సన్నిధానానికి నడక ప్రారంభించారు. ఈరోజు  ఉదయం వీవీఐపీ భద్రత మధ్య వాళ్ళు నీలక్కల్, పంబను దాటి ఆలయం దిశగా సాగారు. కానీ అయ్యప్ప భక్తులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారు వెనుదిరిగారు.  

100 మంది పోలీసులు ఒకవైపు, 20 వేల మంది భక్తులు మరోవైపు నిలువగా, స్వామి దర్శనం కోసం వచ్చిన వాళ్ళు వెనుదిరగక తప్పలేదు. పోలీసుల సాయంతో ఆలయం వరకూ మాత్రమే చేరుకోగలిగారు కానీ భక్తులు అడ్డు నిలవడంతో పోలీసు కార్యాలయానికి తీసుకెళ్లిన ఐజీ శ్రీజిత్, వారికి పరిస్థితిని చెప్పి, వెనుదిరగాలని కోరారు. దీంతో వారు వెనుతిరుగుతామని అంగీకరించారు. ఇదే విషయాన్ని మీడియాకు శ్రీజిత్ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం వాళ్ళు  పోలీసుల భద్రత నడుమ కొండ దిగుతున్నారు.
 
అయ్యప్ప దర్శనానికి వెళ్లిన యువతి ఇంటిని నిరసనకారులు ధ్వంసం చేశారు. వందలాది మంది మహిళలు ఎర్నాకులంలోని రెహ్నా ఫాతిమా ఇంటిపై పడి, బీభత్సం చేశారు. తాను శబరిమలకు వెళుతున్నానని సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ కావడం, ఆపై పోలీసు బందోబస్తు మధ్య ఆమె ఆలయం దగ్గరికి వెళ్ళింది. దీంతో వందలాది మంది ఆ ఇంటిని చుట్టుముట్టి ధ్వంసం చేశారు. ఇంట్లోని వారందరినీ బయటకు గెంటేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here