ఈ టైం లో నామినేషన్ వేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి

0
1059

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఈ రోజు అనగా 12-11-2018 గ్రహ స్థితి ఈరకంగా ఉంది.

  • విశాఖ ౨ అర్కః
  • పూ.షా ౩ చన్దః
  • ధనిష్ఠ ౪ కుజః
  • జ్యేష్ఠ ౧ బుధః
  • అనూరాధ ౨ గురుః
  • చిత్త ౩ వక్రీ శుక్రః
  • మూల ౪ శనిః
  • పుష్యమి ౧ రాహుః
  • ఉ.షా౩ కేతుః

గ్రహ స్థితి పరిశీలిస్తే దాదాపు ఎనిమిది గ్రహాలు అపసవ్యముగా వరుస ఐదు రాశులలో ఉన్నవి.

ఈరోజు నక్షత్రాధిపతి స్వక్షేత్రంలో వక్రగతిని పొంది నీచలో ఉన్న రవితో కలసి ఉన్నాడు

రవి-శుక్రులు తులలో, గురు-బుధులు వృశ్చిక రాశిలో, శని- చన్ద్రులు ధనస్సు లో ఉండి శుభ గ్రాహాలైన గురు బుధులకు పాపార్గళం వల్ల లగ్న నిర్ణయం కీలకపాత్ర పోషిస్తుంది

మద్యాహ్నం 2:05 లగాయతు 4:15 లోపు లగ్నము బలమైనది. తక్కిన సమయంలో మొదలుపెట్టిన కార్యములు అనగా నామినేషన్ దాఖలు, వెనుకకు తీసుకోవడం లేదా సున్నితమైన పరిస్థితి ఏర్పడి ఆటంకాల వల్ల గమ్యం చేరుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది.

– దైవజ్ఞ నిట్టల ఫణి భాస్కర

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here