ఇంట్లో ఈ చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్య లు కలుగుతాయి

0
12606

If this tree is in the house, dangers will be removed and prosperity will be achieved

పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం “ఏక బిల్వం శివార్పణం” అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.

ఙ్ఞాన స్వరూపమయిన పరమాత్ముడే పరమ శివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.

మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము – స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత – ఙ్ఞ్యేయము – ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించినప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయకారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో ” మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!

బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి.
అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.
“పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే” – అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని – బిల్వపత్రరూపంతో ‘ త్రిపుటి ఙ్ఞానాన్ని ‘ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని ” శివోహం, శివోహం ” అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమైన ఈశ్వర పూజకు ” బిల్వపత్రం ” సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.

బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.

ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.

ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.

బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం.

మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే, ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!

తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!

హర హర పార్వతి పతయే మహాదేవ శంభో శంకర !

Mythological Stories

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి? | Lord Shiva Pushparchana in Telugu?

శ్రీ కృష్ణుని తలపై నెమలిపింఛం ఎందుకు? | Why Krishna Wears Peacock Feather Story in Telugu

పాములకు నాలుక ఎందుకు రెండుగా చీలి ఉంటుందో తెలుసా?

కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu

ఉదంకుని కథ | Story of Udanka in Telugu

ఈ రోజు కథ – దాన గుణం | Story of Greatness of Charity in Telugu

కుశిక మహారాజు కథ | Kushika King Story in Telugu

రావి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలు | Worshipping Peepal (Raavi Chettu) Tree

లక్ష్మణునితో పాటు ఊర్మిళాదేవి వనవాసానికి ఎందుకు వెళ్లలేదు ? | Why didn’t Laxman’s wife go with Laxman when they were going for vanvaas

కూర్మావతార కథ | Kurma Avatar Story in Telugu

మోహినీ ఏకాదశి | Mohini Ekadashi in Telugu

జాలరుల నీతి (ఈ రోజు కథ) | Ethics of Fishermen in Telugu

దిలిప మహారాజు – కామధేనువు | Story of King Dilipa in Telugu