గొంతునొప్పి నివారించడానికి టిప్స్! | throat pain cure tips in Telugu

0
3782
 throat pain cure tips in Telugu
throat pain cure tips in Telugu

 throat pain cure tips in Telugu – ఒక చెంచా దాల్చిన చెక్క, నల్ల మిరియాలు మరియు తేనెలను ఒక గ్లాసు వేడి నీటికి కలపండి. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా తాగటం వలన మంచి ఉపశమనం పొందుతారు.

అరగ్లాసు వేణ్నీళ్లలో చెంచా తేనె, చెంచా నిమ్మరసం వేసుకుని తాగాలి. వేడిగా ఉండగానే కొద్దికొద్దిగా తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. అరగ్లాసు పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేసి తాగితే గొంతునొప్పి అదుపులో ఉంటుంది. గొంతునొప్పితో పాటూ జలుబూ ఉంటే అరగ్లాసు పాలల్లో కొద్దిగా పసుపు వేసుకుని తాగాలి.తులసి ఆకులను నీటిలో కలిపి వేడి చేయండి. చల్లబరచిన తరువాత ఈ మిశ్రమంతో పుకిలించి ఉంచండి.

లవంగాలు పంటి నొప్పినే కాదు, గొంతునొప్పినీ అదుపులో ఉంచుతాయి. యాంటీ బ్యాక్టీరియల్‌గానూ వ్యవహరిస్తాయి. అందుకే రెండుమూడు లవంగాలను బుగ్గన పెట్టుకుని వాటినుంచి వచ్చే రసాన్ని చప్పరించాలి. అవి మెత్తగా అయ్యాక నమిలి తినేయొచ్చు.

గోరువెచ్చని నీటిలో వెల్లుల్లి రేకులు వేసి మరిగించి రెండు, మూడు గంటలకొకమారు తాగితే నొప్పి వాపు, ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గొంతు సమస్య అధికంగా ఉన్నప్పుడు ఎక్కువ వేడి నీరు, ఎక్కువ చల్లనీరు తాగకూడదు. శరీరానికి వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. గొంతులో బాధ ఎక్కవగా ఉన్నపుడు ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉండేలా చూసుకోవాలి.

throat pain cure tips in Telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here