ఆయుర్వేద పరం గా థైరాయిడ్ వ్యాధికి చికిత్స

0
10906

thyroid

 

థైరాయిడ్ గ్రంధి మెడ భాగంలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య హైపో థైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం అని రెండు రకాలుగా ఉంటుంది.

 

 థైరాయిడ్ జబ్బును వీలైనంత త్వరగా గుర్తించగలగాలి.
 అయోడిన్ ఉప్పును ఆహారంలో తీసుకోవడం మంచిది.
 వ్యాధి నిర్ధారణ చేసిన తరువాత జీవిత కాల వైద్యం అవసరం కావచ్చు.
 డాక్టరును సంప్రదించి పూర్తి స్ధాయి పరీక్షలు చేయించుకొని వైద్య సలహా పొందాలి.

 

అశ్వగంధ, థైరాయిడ్ సమస్యలకు శక్తివంతంగా పని చేస్తుంది.
అశ్వగంధ ఔషదాన్ని వాడే ముందుగా వైద్యుడిని సంప్రదించటం మరవకండి.
అశ్వగంధ టీ రూపంలోనే కాకుండా చూర్ణ రూపంలో కుడా లభించును.
ఈ ఔషదాన్ని అన్ని రకాల థైరాయిడ్ గ్రంధి సమస్యలకు చికిత్సగా వాడవచ్చు.

అశ్వగంధ వలన కలిగే ప్రయోజనాలు

1. ఇది మీ శరీరానికి వ్యతిరేఖంగా కాకుండా అనుగుణంగా పని చేస్తుంది,
2. అశ్వగంధ ‘అడాప్టోజేన్’గా పనిచేస్తుంది. అనగా ఏదైన మూలకము శరీర రోగనిరోధక శక్తిని పెంచి, ఒత్తిడి,ఉద్రేకత మరియు అలసటను తోలగిస్తుందో దానిని ‘అడాప్టోజేన్’గా పేర్కొంటారు. ఇవి టానిక్’లా పని చేస్తాయి కావున వీటిని రోజు వాడవచ్చు. ఇది థైరాయిడ్ సమస్యల నుండి ఉపశమనాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

3. అడాప్టోజేన్’లు అన్ని రకాల వయసుల వారిలో పనిచేస్తాయి. అనగా ఈ రకమైన రెండు రకాల వ్యాధులను కలిగి ఉన్న వారికి చికిత్సగా వాడవచ్చు, ఉదాహరణకు-ఒక వ్యక్తి థైరాయిడ్ లోపం కోసం ఈ మూలకాన్ని చికిత్సగా తీసుకున్నచో, అతడిలో హైపర్ థైరాయిడిసమ్’కి కుడా అశ్వగంధ చికిత్సగా పనిచేస్తుంది.
4. శాస్త్రవేత్తలు వీటి పైన సమగ్ర పరిశోధనలు జరిపి ఇవి శరీరానికి చాలా పవిత్రమైనవిగా పేర్కొన్నారు
ఈ ఔషదాన్ని కొన్ని సంవత్సరాలుగా థైరాయిడ్ వ్యాధులకు టానిక్’గా వాడుతున్నారు, కావున దీనిని దీర్ఘకాలికంగా వాడిన కూడా ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. ఇది పొడి రూపంలో కుడా లభిస్తుంది, ఈ పొడి రూపం తీసుకోటానికి ఇబ్బందిగా అనిపిస్తే ‘టీ’ లేదా ‘చూర్ణ’ రూపంలో ఉన్న అశ్వగంధని తీసుకోవచ్చు, వీటికి తులసి ఆకులను కలపడం వలన దీని శక్తి మరింత పెరగవచ్చు.
ఈ ఔషదాన్ని వాడిన తరువాత ఇది శక్తివంతంగా పని చేస్తుందో లేదో తెలుసుకోటానికి, ఇది వాడటం ప్రారంభించిన 2 నుండి 3 నెలల తరువాత మీ థైరాయిడ్ హార్మోన్’ని పరీక్ష చేపించుకోండి. ఈ పరీక్షని కూడా ప్రభుత్వముచే ఆమోదం పొందిన వైద్యుడి వద్ద మాత్రమే చేపించుకోవటం మంచిది.
మీరు ఈ ఔషదాన్ని వాడటానికి ముందుగా మీ కుటుంబ సభ్యులతో మరియు వైద్యుడిని సంప్రదించి వారి సలహాలను తీసుకోండి.

 


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here