చంటి బిడ్డల సమస్త వ్యాధుల నివారణకు సులభ ఔషదాలు . | Health Tips for Kids Diseases in Telugu

0
17805
mag_ap_bab2_058_424x302
చంటి బిడ్డల సమస్త వ్యాధుల నివారణకు సులభ ఔషదాలు . | Health Tips for Kids Diseases in Telugu

చంటి బిడ్డల సమస్త వ్యాధులకు –

ఎండిన ఉసిరికాయల పెచ్చులను కొంచం నీళ్లతో మర్దన చేసి గురిగింజలు అంత మాత్రలు చేయాలి . వాటిని గాలికి ఆరబెట్టి సీసాలో పోసి భద్రపరుచుకోవాలి.

తరువాత అవసరం అయినప్పుడు ఉదయం ఒక మాత్ర , రాత్రి ఒక మాత్ర చనుబాలతో గాని , మంచి నీళ్లతో గాని అరగదీసి పిల్లలతో తాగిస్తూ ఉంటే పిల్లలకు వచ్చే సమస్త వ్యాధులు హరించి పొతాయి.

చంటి బిడ్డలకు ఇది ఎంతో క్షేమకరమైన ఔషదం .

* పసిపిల్లల విరేచనాలకు –

మారేడు కాయలలోని గుజ్జు రెండున్నర గ్రాములు మోతాదుగా మంచినీటితో కలిపి తాగిస్తే పిల్లల విరేచనాలు కట్టుకుంటాయి.

* పిల్లకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే –

కొబ్బరి కోరు రెండున్నర గ్రాములు , పటిక బెల్లం పొడి రెండున్నర గ్రాములు కలిపి పిల్లలతో తినిపిస్తుంటే ఎక్కిళ్లు కట్టుకుంటాయి.

* పిల్లల పొడి దగ్గులకు –

తమలపాకు రసం 5 గ్రాములు , తేనే 10 గ్రాములు కలిపి ఒక మోతాదుగా రోజుకి రెండుసార్లు పిల్లలకు ఇస్తుంటే పొడి దగ్గు హరించి పొతుంది.

* పిల్లల పాల ఉబ్బసం వ్యాదికి –

పాల ఉబ్బసం అప్పుడప్పుడు వచ్చే పిల్లలకు ముందుగా రొమ్ముల మీద పొట్ట మీద ఆముదం రాయాలి. తరువాత వేడిగా ఉన్న ఆవుపాలల్లో కాటన్ గుడ్డ వేసి తడిపి బాగా పిండి ఆ గుడ్డతో ఆముదం రాసి ఉన్న పొట్టమీద , రొమ్ము మీద కాపడం పెడితే వెంటనే పాల ఉబ్బసం నుండి పిల్లలు తేరుకుంటారు.

ఈ విధంగా అవసరాన్ని బట్టి రెండు మూడు సార్లు చేస్తే పాల ఉబ్బసం తగ్గిపొతుంది.

* పిల్లల కడుపు లొ ఏర్పడే నులిపురుగులు, ఎలుకపాముల కొరకు –

డ్రై ఫ్రూట్స్ అమ్మే షాపుల్లో దొరికే అక్రోటు పండ్లు తెచ్చి చిన్న పిల్లలకు వయసుని బట్టి సాయంత్రం సమయాల్లో ఒకటి లేక రెండు పండ్లు తినిపిస్తూ ఉంటే తెల్లవారి విరేచనంలో నులిపురుగులు, ఎలికపాములు పడిపోయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. మరియు ఎదుగుతారు.

* పిల్లలు పాలు కక్కుతూ ఉంటే –

ఇంగువ ని నీళ్లతో గంధం లాగా అరగదీసి పిల్లల కడుపు పైన లేపనం చేస్తే పాలు కక్కడం ఆగిపొతుంది.

* పిల్లలు పక్కలో మూత్రం పోస్తూ ఉంటే –

సంపెంగ చెట్టు బెరడుతో కాచిన కషాయాన్ని పూటకు 10 గ్రాముల చొప్పున తాగిస్తూ ఉంటే పక్కలో మూత్రం పోసే అలవాటు పోతుంది .

* పిల్లల వాంతులు – దగ్గులు –

కరక్కాయ బెరడు ని చూర్ణం చేసి పూటకు 2 గ్రా చూర్ణం లొ తగినంత తేనే కలిపి రెండు పూటలా తినిపిస్తూ ఉంటే వాంతులు , దగ్గులు , నెమ్ము , మలబద్దకం, కడుపులో నొప్పి , అజీర్ణం, కడుపు ఉబ్బరం , ఇవన్ని తొలగిపోయి పిల్లలు ఆరొగ్యముగా ఎదుగుతారు.

* పిల్లలకు మూత్రం బిగదీస్తే –

నిమ్మకాయ లొని గింజలని నీళ్లతో మెత్తగా నూరి , బొడ్డు పైన రాసి పైన చన్నీళ్ళు కొద్దికొద్దిగా పోస్తూ ఉంటే బిగుసుకుపోయిన మూత్రం వెంటనే సాఫీగా బయటకు వెళ్తుంది.

* పిల్లల దగ్గులకు – జ్వరాలకు

తులసి ఆకుల రసం 100 గ్రా వడపోసుకుని అందులో 25 గ్రా పటికబెల్లం ( కలకండ ) కలిపి పాకంగా కాచి పూటకు రెండున్నర గ్రాములు చొప్పున రొజూ రెండు పూటలా తినిపిస్తూ ఉంటే అన్ని రకాల దగ్గులు , జ్వరాలు సునాయాసంగా హరించి పోతాయి .

* పిల్లల వంటి దురదలకు –

వేప చిగురాకులు, నువ్వులు సమాన బాగాలుగా కలిపి మర్దించి ( నూరి ) వళ్ళంతా పట్టిస్తూ ఉంటే దురదలు, చిడుము తగ్గిపోతాయి .

* పసిపిల్లల జలుబుకు –

పిల్లలకు జలుబు చేయగానే తమలపాకులు కు ఆముదం రాసి వెచ్చజేసి పిల్లల రొమ్ముల పైన , పొట్ట పైన , తల పైన కాపడం పెడితే వెంటనే జలుబు తగ్గిపొతుంది.

* పిల్లల నోటి పూతకు –

రావి చెట్టు బెరడు , రావి చిగురు ఆకులు సమంగా కలిపి నూరి పూటకు 5 గ్రా చొప్పున నాకిస్తూ ఉంటే పిల్లల నోటి పూత తగ్గిపొతుంది.

* పిల్లల వాంతులకు –

యాలుక గింజలు, దాల్చిన చెక్క, సమంగా కలిపి నూరి 3 గ్రా చూర్ణాన్ని తేనెతో కలిపి పిల్లలకు తినిపిస్తే వాంతులు వెంటనే కట్టుకుంటాయి.

* పిల్లల చెవుడు తగ్గాలి అంటే –

ఒంటె మూత్రాన్ని సంపాదించి చెవుడు ఉన్న చెవిలొ రోజు నాలుగయిదు చుక్కలు వేస్తూ ఉంటే వారం రోజుల్లో చెవుడు తగ్గిపొతుంది.

కాళహస్తి వెంకటేశ్వరరావు *

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here