మ‌ధుమేహ వ్యాధిని అదుపు చేసే చిట్కాలు…! Tips to Control Diabetes in Telugu

0
3695
tips to control diabetes
tips to control diabetes
 

tips to control diabetes

 
ప్రస్తుతం దేశంలో అధిక శాతం మంది ఇబ్బంది ప‌డుతున్న‌ది  మధుమేహం వ్యాధితో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జనాభాలో సుమారుగా 9 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే టైప్ 1 డయాబెటిస్ వచ్చేందుకు జన్యు పరమైన అంశాలు కారణమైతే, టైప్ 2 డయాబెటిస్‌ను చాలా మంది కొని తెచ్చుకుంటున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, మద్యపానం, ధూమపానం, అధికంగా బరువు ఉండడం, సమయానికి తగినన్ని గంటల పాటు నిద్రించకపోవడం…వంటి పలు కారణాల వల్ల అధిక శాతం మందికి టైప్ 2 డయాబెటిస్ వ‌స్తోంది. అయితే మధుమేహం వచ్చిన వారు వైద్యుల‌ సూచన మేరకు మందులను వాడడం ఎంత ముఖ్యమో జీవన విధానంలోనూ మార్పులు చేసుకోవడం అంతే ముఖ్యం. వాటితో పాటు కింద సూచించిన పలు చిట్కాలు పాటిస్తే.. మధుమేహాన్ని విజయవంతంగా అదుపులో పెట్టుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
  • రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒక టీస్పూన్ పసుపును కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుంది.
  • ప్రతి రోజూ ఉదయాన్నే ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని కలుపుకుని తాగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
  • నిత్యం ఉదయాన్నే 60 నుంచి 100 ఎంఎల్ మోతాదులో కాకరకాయ రసాన్ని తాగాలి. 2 నెలల పాటు ఇలా తాగితే కచ్చితంగా డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.
  • ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరికాయ రసాన్ని కలిపి నిత్యం ఉదయాన్నే పరగడుపునే తాగితే ఫలితం ఉంటుంది.
  • రోజూ 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను భోజనంలో తీసుకుంటుంటే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది.
  • కరివేపాకు పొడిని భోజనంలో మొదటి ముద్ద కలుపుకుని తింటే ఫలితం ఉంటుంది.
  • రోజూ రాత్రి ఒక కప్పు నీటిలో గుప్పెడు మెంతులను నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటిని తాగి, ఆ గింజలను తినాలి. ఇలా 3 నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.
  • నేరేడు గింజల చూర్ణాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో దాన్ని కలిపి నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి.
  • మునగ ఆకుపొడిని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపునే తాగితే డయాబెటిస్ నుంచి బయట పడవచ్చు.
  • ఒక రాగి పాత్రలో నీటిని పోసి అందులో కొన్ని తులసి ఆకులు వేయాలి. ఆ నీటిని రాత్రంతా అలాగే ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే తాగేయాలి. దీంతో డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here