
Tirumala Srivari Darshan Tickets For October 2023 Released
1నేడు శ్రీవారి దర్శన కోటా విడుదల అక్టోబర్ 2023
శ్రీ వెెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోట్లాది మంది కోరుకుంటూ ఉంటారు. కానీ టికెట్లు అందుబాటులో లేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. నేడు ప్రత్యేక దర్శన కోటాను టీటీడీ విడుదల చేస్తుంది. ఏఏ టోకెన్లు అందుబాటులోకి తెస్తోంది?. 3 నెలలకు సంబంధించి ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకోస్తోంది టీటీడీ. ఎలా బుక్ చేసుకోవాలి? నేటి ఉదయం అవి బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.
ముందుగా అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టికెట్లను నేటి ఉదయం టీటీడీ విడుదల చేయనుంది. నేటి ఉదయం 10 గంటలకు టీటీడీ వెబ్ సైట్ లో అక్టోబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అందుబాటులో ఉంటాయి. అలాగే అంగ ప్రదక్షణ టోకెన్లతో పాటు, శ్రీవాణి ట్రస్ట్ టోకెన్లు కూడా విడుదల చేస్తున్నారు.
వికలాంగులు, వయోవద్ధుల దర్శన టికెట్లు కూడా నేడే విడుదల చేయనున్నారు. అక్టోబర్ నెలకు సంబంధించి టికెట్లు రోజుకి 15 వేల చొప్పున విడుదల చేయనున్నారు. మంగళవారం నాడు అంటే రేపు 300 ప్రత్యే ప్రవేశ దర్శన టికెట్లు కూడా టీటీడీ వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి.ఆగస్ట్, సెప్టెంబర్ నెలకు సంబంధించి రోజుకు 4 వేల చొప్పున అదనపు కోటా టికెట్లను జులై 25న తేదీన టీటీడీ విడుదల చేయనుంది. గదులకు సంబంధించి కూడా వివరాలు చెబుతాయి.తలకోనలో ఆక్టోబర్ నెలకు సంబంధించి గదుల సమాచారాన్ని జులై 26న ఉదయం 10 గంటలకు వెబ్ సైట్ అందుబాటులో ఉంచుతారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.