శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches

0
4665
Tirumala Srivari Watches Will be E Auctioned by TTD
How Bought Tirumala Srivari Watches

Tirumala Srivari Watches Will be E Auctioned by TTD

1తిరుమల శ్రీవారి వాచీలను టీటీడీ వేలం

శ్రీవారి భక్తులకు ఇదోక అద్భుతమైన అవకాశం. కలియుగ వైకుంఠనాదుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలను ఈ వేలంలో దగ్గించుకోవచ్చు.

నిత్యం శ్రీవారికి వేలాది భక్తులు చాల రకాల కానుకలు సమర్పిస్తుంటారు. ఇవి డబ్బుల రూపంలో రోజుకి 3-5 కోట్లు, బంగారం, వెండి మరియు ఇతర వస్తువుల రూపంలో వస్తూంటాయి. ఇలాంటి వాటిలో గాడియారాలు (వాచీలు) ఒకటి. ఇలా భక్తులు కానుకగా ఇచ్చిన వాచీలు టీటీడీ వద్ద భారీగా పోగయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ ఆ వాచీలను వేలం వేయాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో భక్తులు ద్వారా కానుకగా వచ్చిన వాచీల‌ను వేలం వేయనున్నారు.

మే 15న రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా వాచీలను ఈ- వేలం వేయ‌నున్నారు. ఇందులో అంతర్జాతీయంగా ప్రస్సిద్ది చేందిన టైటాన్‌, టైమ్స్, హెచ్ఎంటి, టైమెక్స్‌, ఆల్విన్‌, సీకో, సొనాట, టైమ్‌వెల్‌, ఫాస్ట్‌ట్రాక్ కంపెనీల వాచీలున్నాయి. కొత్తవి/ఉపయోగించినవి/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం 18 లాట్లు ఈ-వేలంలో ఉంచుతారు.

Back