తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?

0
4370
Srivari Devotee Captured Video Inside of Tirumala Temple
Srivari Devotee Shooted Video of Ananda Nilayam

Srivari Devotee Captured Video Inside of Tirumala Temple

1తిరుమల ఆలయం లోపల వీడియో తీసిన శ్రీవారి భక్తుడు

తిరుమల అంటే అధ్యాత్మిక క్షేత్రం, భక్తుల రాకపోకలే కాకుండ పఠిష్టమైన భద్రతకు పెట్టింది పేరు. ప్రతి రోజు వేల సంఖ్యలో భక్తులు ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తూంటారు. అందుకే అలయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అంచెల భద్రత ప్రమాణాలను అమలు చేస్తారు. ఇంత భద్రతలో కూడ ఏమైన అతి చిన్న ఘటన అయితే వెంటనే విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం అవుతుంది. ఇది కాకుండా శ్రీవారి అలయంలో వెయ్యికి పైగా సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది.

భద్రత సిబ్బందిని దాటుకోని VVIP, VIP, Celebrities కూడ అలయంలోకి ఏమి తీసుకోని పోలేరు. అలాంటి ఇంత పఠిష్ఠమైన భద్రతను దాటుకోని ఒక సామన్య భక్తుడు మొబైల్ ఫోన్ ని ఆలయం లోపలికి తీసుకోని పోవడమే కాకుండా ఆలయంలోని సంపంగి ప్రాకారం నుంచి విమాన ప్రకారం వరకు చిత్రీకరించి సోషల్ మీడీయాలో పెట్టాడు. ఈ సంఘటనతో శ్రీవారి ఆలయంలో మరోసారి బయటపడిన టిటిడి విజిలెన్స్ అధికారుల వైఫల్యం కోట్టోచ్చినట్లు కనిపిస్తోందని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులను తనిఖీ చేపట్టే ప్రక్రియలోని లోపాలు భయటపడినట్లు అయింది. ఈ ఘటన ఆదివారం రాత్రి శ్రీవారి ఆలయంలోకి మొబైల్ ఫోన్ తో భక్తుడు ప్రవేశించాడు. శ్రీవారి దర్శనం తర్వాత బంగారు వాకిలి దాటిన వెంటనే వకుళ మాత ఆలయం ప్రాంతంలో నిల్చొని ఉన్న సమయంలో ఆలయంను సెల్ ఫోన్ తో చిత్రీకరించాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపం నుంచి తీసిన వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన వెంటనే వైరల్ గా మారింది. ఆ భక్తుడు శ్రీవారి ఆలయంతో పాటు పలు ఉప ఆలయాలను కూడా సెల్ ఫోన్ లో చిత్రీకరించినట్లు తెలుస్తోంది.

Back