వైభవంగా తిరుపతి గంగమ్మ జాతర, ఈ యేడాది ఇదే స్పెషల్ | Tirupati Gangamma Jatara 2023 Updates

0
461
How was the Tirupati Gangamma Jatara 2023
How Was Celebrated Tirupati Gangamma Jatara 2023

Tirupati Gangamma Jatara 2023 Special

1తిరుపతి గంగమ్మ జాతర 2023 ప్రత్యేకత

గంగమ్మ జాతర అంటే రాయలసీమలో తెలియని వారు ఉండరు అంటే అశియయోక్తి కాదు అంతలా పేరు ఉన్న జాతర. చిత్తుర్ జిల్లాలో తిరుమల శ్రివారు ఎంత ప్రసిద్దో గంగమ్మ జాతర కూడ అంతే ప్రసిద్ది. ప్రతి యేట చిత్తూరు, పుంగనూరు, కుప్పం , వీకోట, బైరెడ్డిపల్లి మండలాల్లో గంగమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

ఆనవాయితీగా ప్రతి యేడు 3 రోజులు గంగమ్మ జాతర జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం భక్తులు, పెద్దల సహకారంతో, ఆలయ కమిటీ నిర్ణయం ప్రకారం పలమనేరు పట్టణంలో ఏప్రిల్ 30వ తేదీ నుండే మొదలు అయిన గంగజాతర. మొదటి రోజు గుండుబావి దగ్గర అమ్మవారి విగ్రహానికి పూజలు చేసి, పలమనేరు గంగమ్మ దేవలయం వీధిలో అమ్మ వారి విగ్రహం పక్కన గంగమ్మ దేవత శిరస్సును భక్తుల దర్శానార్దం కొలివు తీర్చడం ఆనవాయితీగా వస్తున్న పద్దతి.

కాని ఈ యేడు పలమనేరు పట్టణ పరిసరాల్లో ఉంటున్న ప్రజలు రోజుకు 2 కులాల చొప్పున 17 రోజులు మొత్తంగా 34 కుల సంఘాలు వారివారి సంప్రదాయాలతో పుర వీధుల్లో ఊరేగింపుగా ఆలయ ప్రాగణం చేరుకొని అమ్మ వారికి అభిషేకాలు చేసి, తీర్థ ప్రసాదాలు అందజేసి, వచ్చిన భక్తులకి అన్నదానం ఏర్పాటు చేశారు. అమ్మ వారి శిరస్సును తిలకించడానికి ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకొంటారు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back