సాయి బాబా మీ కోరికలు తీర్చాలంటే

0
64962
desire come true by sai baba grace
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS 

సాయి బాబా మీ కోరికలు తీర్చాలంటే నవ గురువార సాయిబాబా వ్రతం చేస్తే మంచిది. ఐతే ఈ వ్రతానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

Back

1. వ్రత ఆచరణ నియమాలు

  1. ఏ భక్తుడైనా స్త్రీ పురుష భేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును.
  2. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును.
  3. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోనూ ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును.
  4. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తీపూరితముగా సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి.
  5. ఉదయం సమయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాథుని పటమును గాని విగ్రహనును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలో వున్న చక్కర గాని, మిఠాయిగాని, ఫలములు గాని నైవేద్యముగా సపర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి.
  6. పాలుగాని, కాఫీగాని, టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూత (మధ్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తీ ఉపవాసంతోనూ ఈ వ్రతమును ఆచరించరాదు.
  7. వీలైనచో 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.
  8. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును.
  9. ఈ 9 గురువారములు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయవచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారములు పూర్తిచేయాలి.
Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here