
meena sankranti
1. మీన సంక్రాంతి విశేషం
సూర్యుడు మీన రాశిలోకి (meena sankranti) ప్రవేశించినప్పుడు మీన సంక్రాంతి ఏర్పడుతుంది. సంవత్సరం లోని పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలో కి సూర్యుడు ప్రవేశిస్తాడు. అలా ప్రవేశించడం సంక్రమణం. కాబట్టి మనకు మాసానికొక సంక్రాంతి పండగ వస్తుంది. వాటిలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి తో మనం ఉత్తరాయణ పుణ్యకాలం లోకి ప్రవేశిస్తాం. అందుకే అన్ని సంక్రాంతులకన్నా మకర సంక్రాంతికే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాం. మీన సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం లో వచ్చే చివరి సంక్రాంతి అందుకే మీన సంక్రాంతిని చాలా ప్రాంతాలలో విశిష్టంగా జరుపుకుంటారు.
Promoted Content