
Mahabharatam
ఈ భూలోకం లోనే అతి ప్రాచీనమైన, పురాతనమైన, ఉన్నతమైన గొప్ప సంస్కృతికి మనము వారసులము అని మన పురాణాలను, చరిత్రను చుస్తే మనకు అర్ధమైతుంది. కొన్ని వేల సంవత్సరాల పూర్వమే అంటే పరమత ఆనవాళ్ళు కూడా పుట్టని కాలం లోనే విజ్ఞాశాస్త్రములు అందించిన ఫలాలను అనుభివించారు. ఖగోళ, భూగోళ, గణిత, వైద్య, అణుసిద్దాంత, కాంతి వంటి భౌతిక శాస్త్ర అంశాలు, ఖనిజ, రసాయన, నిర్మాణ శాస్త్ర, నౌకా శాస్త్రం, అర్ధ శాస్త్రం మొదలైన అంశాలలో మన ప్రాచీనులు సాధించిన ప్రగతి చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. ఇందుకు సింధు-సరస్వతి నాగరికత కు సంబంధించిన త్రవ్వకాలలో అనేకమైన ఋజువులు బయటపడ్డాయి.ఖగోళ శాస్త్రానికి సంభందించి మౌర్యుల కాల క్రి.పు.5వ శతాబ్దం నుండి మొఘలుల కాలం 16వ శతాబ్ధము వరకు సాహిత్యం లో అనేక ఋజువులున్నాయి.
క్రి.పు.5వ శతాబ్దానికి చెందినా పాణిని ప్రపంచపు అత్యన్నత భాష శాస్త్రవేత్తగా లెక్కించారు. అయన రచించిన “పాణినీయం” ప్రామాణిక సంస్కృత వ్యాకరణ గ్రంధం. భర్తుహరి రచనలు కూడా ఆచరిణాలు.
గణిత శాస్త్రములో క్రి.శ.400 నుండి 1200 మధ్యకాలంలో ఆర్యభట్టు, బ్రహ్మ గుప్త, భాస్కరాచార్య వంటి శాస్త్రవేత్తల రచనలలో శున్యాంక పధ్ధతి, అంక గణితం, చీజ గణితం, త్రికోణమితి, సైన్ కోసైస్, వంటి ఆధునిక గణిత శాస్త్ర ప్రయోగాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి.
క్రీ.పు5వ శతాబ్దములో ఆయుర్వేదం ప్రజలందరికి అందుబాటులో ఉండేది. నాగర్జనుడు, సురానందుడు, నాగబొధి, యశోధన, గోవింద వంటి మహా వైద్యులు ఆ కలం లోనే ఉన్నారు. క్రీ.పు.6వ శతాబ్దంలో సుశ్రుతుడు రచించిన “సుశ్రుతం”అనే శస్త్రవైద్య శాస్త్ర (సర్జరీ) గ్రంధం అందుబాటులో ఉంది. చరకుడు రచించిన ఆయుర్వేద గ్రంధం “చరక సంహిత” ఇప్పటికి ప్రామాణికము. 8వ శతాబ్దం లో మాధవుడు రచించిన “మధననిదానం” అనే గ్రంధం ఇప్పటికి వైద్యశాస్త్ర ప్రామాణిక గ్రంధం.
Good messages for our Indian culture