టీటీడీ పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్, ఇదే అధికారిక వెబ్‌సైట్ | TTD Official Website vs Fake Websites

0
456
TTD Official Website vs Fake Websites
TTD Fake Websites List

TTD Alerts to Devotees About Fake Websites

1నకిలీ వెబ్‌సైట్ల గురించి భక్తులకు టీటీడీ సమాచారం

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో మరో నకిలీ వెబ్‌సైట్ నడపుతుంది. దీనితో అప్రమత్తమైన టీటీడీ యంత్రాంగం, భక్తులకు పలు సూచనలు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

1. టిటిడి ఐటీ విభాగం ఇంకో నకిలీ వెబ్‌సైట్‌ను గుర్తించింది. దీనిపై పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు కూడ చేసింది. ఇలాంటి నకీలీ వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటి బారిన పడకుండా ఉండాలని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
2. ఇలా నకీలీ వెబ్‌సైట్లు దొరకడం కొత్తేమి కాదు. ఇప్పటి వరకు దాదాపుగా 40 నకిలీ వెబ్‌సైట్స్‌ని గుర్తించారు. తాజాగా 41వ వెబ్‌సైట్ దొరకడం విశేషం. ఐపీసీ సెక్షన్ 420,468,471 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
3. ఇప్పుడు దొరికిన నకిలీ వెబ్‌సైట్ దాదాపుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండటం విశేషం. దీన్ని స్వల్ప మార్పులతో మాత్రమే రూపొందించారు కిలాడీలు. కొత్త వారు ఎవరైన చూస్తే అస్సలు గుర్తు పట్టరు.

Back