తిరుమలలో ఇవి మాయం!! టిటిడి అధికారుల స్పందన!!

0
6687
TTD Gives Clarity on Gold Missing Rumours at Govinda Raj Temple
Tirumala Tirupati Devastanam Gives Clarity on Gold Missing Rumours

TTD Gives Clarity on Gold Missing Rumours at Govinda Raj Temple

1బంగారం మాయంపై టిటిడి వివరణ

తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ దేశంలోనే పెద్దది. అలాంటి సంస్థలో గందరగోళం నెలకొంటుంది. శ్రీగోవింద రాజ స్వామి ఆలయ విమాన గోపురం బంగారు తాపడం పనులను ఈ మద్యే 50 కిలోల బంగారంతో మొదలుపెట్టారు. కాని బంగారం పక్కదారి పట్టిందంటూ వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనిపై టిటిడి కూడ స్పందించింది.

హిందూ జన శక్తి సంస్థకు చెందిన శ్రీ లలిత్ కుమార్, శ్రీ ఆదిపట్ల కళాపీఠం అధ్యక్ష్యురాలు శ్రీమతి కరాటే కల్యాణి గార్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీటీడీ అంటుంది. తమ ఉనికిని చాటుకోవడానికి వారు నానా రభస చేస్తున్నారు అని వీటిని టీటీడీ తీవ్రంగా ఖండిస్తుంది అని అన్నారు. బంగారు తాపడం పనులు జరుగుతున్న పాత హుజూర్ ఆఫీసు చుట్టు ప్రక్కల 24 గంటలూ సీసీ కెమెరాల నిఘా ఉంటుందని టీటీడీ పేర్కొంది.

సంబంధిత సిబ్బంది లోపలికి వెళ్ళాలంటే రిజిస్టర్లో పేరు నమోదు చేసి, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు అక్కడే భద్రపరుచుకోని లోనికి వెళ్ళాలనే నింబధనలు ఉన్నాయి. ఇది నిషిద్ధ ప్రాంతం అందులోనూ స్ట్రాంగ్ రూమ్. పని జరిగే ప్రాంతంలో పూర్తి స్థాయిలో కఠినమైన నియమాలు, అధికారుల పర్యవేక్షణ, విజిలెన్స్ బందోబస్తు ఇలా చలానే ఉంటాయి. ఇంతటి కట్టుదిట్టమైన ప్రదెశం నుండి 50 కిలోల బంగారం పక్కదారి పట్టించారని ఆరోపించడం సరికాదు అని టిటిడి అంతుంది. ఆలయ శిల్ప సంప్రదాయం ప్రకారం, జీయర్ స్వాములు, అర్చకుల సలహాలను తీసుకుంటూ స్థపతుల ప్రత్యక్ష పర్యవేక్షణలో పనులు సాఫీగా జరుగుతున్నాయి. ఇక్కడి శిల్ప సంపదకు ఇబ్బంది కలిగించే ఆస్కారమే లేదు. ఈ విషయాలు తెలుసుకోకుండా అభాండాలు వేసేవారు అవగాహనారాహిత్యంతో ఆరోపణలు చేయడం మంచిది కాదని టీటీడీ హెచ్చరిస్తోంది.

Back