
TTD New Record in Online Darshan and Seva Tickets Sales in Tirumala
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు
ఇప్పుడు పెళ్ళి ముహుర్తాలు, పరీక్షల సమయం కాబట్టి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి దర్శనం కోసం భక్తులు పొటేత్తుతున్నారు. ఈ మద్యనే టీటీడీ దర్శనం మరియు ఇతర సేవ టికెట్లను ఆన్ లైన్లో వచ్చే రెండు నెలల కోటను విడుదల చేసింది. కేవలం 9 నిమిషాల్లోనే అంగప్రదక్షణ టికెట్లు అమ్ముడయ్యాయి. అదే విధంగా 300 రూ ప్రత్యేక దర్శనంకు సంబంధించి ఆరు లక్షల టోకెన్లు కేవలం 85 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. ఈ విధంగా భక్తుల నుంచి అనూహ్య స్థాయిలో స్పందన కనిపించి తన రికార్డు తనే అధికమించింది. దీన్ని బట్టి చూస్తే సేవ టికెట్లకి ఫుల్ డిమాండ్ ఉన్నట్లు అర్ధమౌతుంది.
మార్చి నెలతో పాటు ఏప్రిల్ నెల టికెట్లు కూడ అమ్ముడయ్యాయి. వయో వృద్ధులు, వికలాంగుల కోసం విడుదల కేసిన కోటా కూడా కేవలం 95 నిమిషాల్లోనూ అయిపొయాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కొనేందుకు భక్తులు టీటీడీ వెబ్ సైట్ తో పాటుగా మొబైల్ యాప్ ద్వారా పెద్ద ఎత్తున బుక్ చేసుకోవడనికి ప్రయత్నించారు. దీంతో కేవలం 85 నిమిషాల్లోనే 6 లక్షల టోకెన్లు అమ్ముడైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఈ మధ్యాహ్నం మూడు నెలలకు సంబంధించిన 46 వేల శ్రీవాణి టికెట్లను అందుబాటులో ఉంచారు. అన్ లైన్ టోకెన్ల బుకింగ్ వలన టీటీడీకి రూ 10 కోట్ల మేర ఆదాయంతో కొత్త రికార్డు నమోదైంది.
Related Posts
TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది