
TTD Reveals Annual Budget Estimations of Tirumala Tirupati Devasthanams for Year 2023-24
12023-24 సంవత్సరానికి టీటీడీ బడ్జెట్
టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.2023-24 గాను 4,411.68 కోట్లు ప్రవేశపెట్టింది. వార్షిక బడ్జెట్ 2022 -2023 గాను 3096 కోట్లు. ఈ సంవత్సరం బడ్జెట్ పొయిన సంవత్సరం బడ్జెట్ తో పోలిస్తే 43 శాతం పెరిగింది. టిటిడి చరిత్రలోనే ఇదే అత్యధిక బడ్జెట్. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు అన్నమయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బడ్జెట్ వివరాలు తెలిపారు. ఈ బడ్జెట్ ని టీటీడీ పాలక మండలి ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపించాము అని తెలిపారు, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడ ఆమోదించింది . ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణం వల్ల ఈ బడ్జెట్ ను ఎమ్మెల్సీ ఎలక్షన్ అయ్యాక ప్రకటించారు.
శ్రీవారికి కరోనా ముందు రూ.1,200 కోట్ల ఆదాయం వచ్చింది. కానీ ఈ సంవత్సరం 1,500 కోట్ల పైనే ఆదాయం వచ్చినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారు ప్రకటించారు.రానున్న రోజుల్లో టీటీడీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగినందువల్ల మరియు రూమ్ అద్దె పెరిగినందువల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది అని ఒక్క అంచన. తిరుమల హుండీ నుండి 1519 కోట్లు, 300 కోట్లుల దర్శనం రసీదులు, 330 కోట్లు ఆర్జితసేవా ,126 కోట్లు తల నిలాలు నుంచి వచ్చాయి.