
Story of Twarita Devi
త్వరితాదేవి ఇహలోకం లో ఎన్నో లౌకిక సుఖాలను ప్రసాదిస్తుంది. మరణానంతరం పరలోకం లోనూ ఆమె మోక్షప్రాప్తిని ప్రసాదిస్తుంది. ఈమె గురించి అగ్ని పురాణం లో చెప్ప బడింది.
అమ్మ వారు నెమలి పింఛాన్నితల ధరించి ఉంటుంది. పాశాంకుశాలను రెండుచేతులలో కలిగి ఉంటుంది. బంగారురంగులోని అమ్మవారి భూషణాలు సర్పాలను పోలి ఉంటాయి. అమ్మవారి ని ధ్యానించేటప్పుడు లేదా పూజించేటప్పుడు పైన ఇచ్చిన పటం లోని రూపాన్ని భావించాలి.
- గోధుమలనూ వడ్లనూ హోమ ద్రవ్యాలుగా వాడితే ఆరోగ్యమూ, సౌందర్యమూ ఆకర్షణీయమైన మేని ఛాయ పొందుతారు.
- హోమ సమయం లో మద్ది చెట్టు దళాలను అమ్మవారికి సమర్పిస్తే బంగారం లభిస్తుంది.
- బియ్యాన్ని/ వడ్లనూ, నువ్వుల నూనెనూ హోమానికి వాడితే ప్రతిచోటా విజయం లభిస్తుంది.
- తామర పూవులతో పూజ చేయడం వల్ల ఇంటిల్లిపాదీ ప్రశాంతనా ఉంటుంది.
- కుంద పుష్పాలతో ఊజ చేయడం వల్ల ధన సమృద్ధి పెరుగుతుంది.
- ఎర్రని కమలాల తో అర్చించడం ద్వారా అదృష్టం సంప్రాప్తిస్తుంది.
- అగ్ని పురాణం లో చెప్పిన విధంగా జాజి పూల తో పూజించడం వల్ల సంఘం లో గౌరవం పెరుగుతుంది.
- అశోక పూల తో పూజించడం వల్ల ఉత్తమ లక్షణాలు గల కుమారుడు జన్మిస్తాడు.
- మామిడి పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల ఆయువు పెరుగుతుంది .
- నువ్వులు సంర్పించడం వల్ల సంపద మరియు అందం పెరుగుతాయి.
అమ్మవారి పూజను హోమాన్నీ తప్పని సరిగా వేద పండితుల సమక్షం లో శాస్త్రోక్తంగా నిర్వహించాలి.