ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే మానవప్రయత్నం తోపాటు భగవంతుని కటాక్షం ఎంతో అవసరం. మన ప్రయత్నం ఎంత బలంగా ఉన్నా ఒక్కోసారి అనుకోని అవాంతరాలు, ఆపదలు మన విజయాన్ని అడ్డుకోవచ్చు అలాంటప్పుడు ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన సరైన పరిష్కారం. ఉచ్ఛిష్ట గణపతిఆరాధన తాంత్రిక సాధనలలో చాలా ప్రధానమైనది. ఉచ్ఛిష్ట గణపతిని సాత్విక పద్ధతిలో ఆరాధించడం వల్ల అడ్డంకులు తొలగిపోయి విజయాన్ని సాధిస్తారు. సమాజం లో కీర్తిప్రతిష్టలను పొందుతారు.
1. ఉచ్ఛిష్ట గణపతి ఎవరు? ఆయన రూపం ఎలా ఉంటుంది?
వినాయకుని 32 రూపాలలో ఎనిమిదవ రూపం ఉచ్ఛిష్ట గణపతి. ఉచ్ఛిష్ట గణపతి మిగతా 31 రూపాలకన్నా ఎంతో తీవ్రమైన, శక్తివంతమైన రూపం. ఉచ్ఛిష్ట గణపతి ఆరు చేతులతో ఉంటాడు. ఆయన ఎడమతొడపై శక్తి కూర్చుని ఉంటుంది. స్వామి నీలవర్ణంతో విరాజిల్లుతుంటాడు. కుడి చేతులలో జపమాల, దానిమ్మపండు,వరికంకులు ఉంటాయి. ఎడమచేత వీణను,నీలి కలువపువ్వు ను ధరించి ఒక చేతితో శక్తిని పట్టుకుని ఉంటాడు. శక్తి ఆయన వామాంకం పైన లేని రూపం కూడా చాలాచోట్ల కనబడుతుంది.
ఆ శ్లోకం అర్ధం