ఔదుంబరవృక్ష పూజ | Udumbara Tree Puja in Telugu

0
10587
oudumbara-tree
ఔదుంబరవృక్ష పూజ | Udumbara Tree Puja

ఔదుంబరవృక్ష పూజ | Udumbara Tree Puja in Telugu

ఔదుంబర వృక్షం / మేడి చెట్టు / అత్తి చెట్టు / బొడ్డ చెట్టు / క్షీర వృక్షం / హేమదుగ్ధ వృక్షం / దత్త వృక్షం.

Fig-Tree-శ్రావణశుద్ధ విదియనాడు ఔదుంబర వృక్షమునందు శివుని, శుక్రుని ఉద్దేశించి పూజించాలి. అది అందుబాటులో లేకపోతే గోడపైన ఔదుంబరవృక్ష చిత్రమును లిఖించి పూజించి ఈ విధంగా ప్రార్ధించాలి.

“ఉదుంబర నమస్తుభ్యం నమస్తే హేమపుష్పక సజంతుఫలయుక్తాయ నమో రక్తాండశాలినే”.

2. ప్రదక్షణ మరియు పూజించు విధానము

ఔదుంబరానికి నెమ్మదిగా ” దిగంబరా.. దిగంబరా..శ్రీపాద వల్లభ దిగంబరా.. , దిగంబరా..దిగంబరా..శ్రీ నృసింహ సరస్వతి దిగంబరా.. , దిగంబరా..దిగంబరా..శ్రీ దత్తాత్రేయ దిగంబరా..” అనుకుంటూ, గురుస్తుతి చేస్తూ ప్రదక్షణలు పూర్తిచేయాలి. ప్రతీ ప్రదక్షణకు ముందు, తర్వాత ఔదుంబర వృక్షానికి నమస్కరించాలి. ఔదుంబరానికి కనీసంగా 7 ప్రదక్షణలు, గరిష్టంగా రెండులక్షల వరుకు చేయవచ్చు. శీఘ్ర ఫలితాల కోసం ఔదుంబర దీక్ష ను కూడా చేపట్టవచ్చును. ఔదుంబర వృక్ష పత్రాలతో శ్రీపాదుడుని పూజించిన శ్రీపాదుల వారి అనుగ్రహము శీఘ్రముగా కలుగుతుంది. మొత్తం ప్రదక్షణలు పుర్తైన తరువాత వృక్షానికి 3 లేదా 7 లేదా 9 చిన్న బిందెల లేదా చెంబుల నీళ్ళను పోయాలి.

ఔదుంబర పాదుకా స్తోత్రం

ఔదుంబర స్తుతి
ఔదుంబర: కల్పవృక్షః కామదేనుశ్చ సంగమః చింతామణిర్గురో: పాదో దుర్లభో భువనత్రయే
Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here