
Ugadi Slokam in Telugu
1. ఉగాది అంటే ఏమిటి? (What is Ugadi?)
ఉగాది నాడు ఈ శ్లోకాన్ని చదివి ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని ‘బ్రహ్మకల్పం’ అంటారు ఇలా ప్రతికల్పంలోనూ మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయాన్ని ‘ఉగాది’ అని వ్యవహరిస్తారు.
ఈ ‘ఉగాది’ పండుగ మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.
Promoted Content