2. ఉగాది పాట
ఉగాది పండుగ వచ్చింది!
ఊరికి అందం తెచ్చింది!
ఉత్సవాలతో దేవుళ్లకు!
ఊరేగింపులు సాగాయి!
గుడిలో దేవుని పూజించి!
గురువుల పెద్దల రావించె!
పంచాంగాలను చదివించె!
మంచీచెడ్డలు విన్నాము!
అక్కలు,బావలు ఆశలతో
చక్కావచ్చారు పండుక్కి!
అమ్మవేకువ లేచింది!
అందరికి తలలు కడిగింది!
సరిపడే నగలు ఇచ్చింది!
సరిక్రొత్త బట్టలు పెట్టింది!
కులదేవతలను కొలిచింది!
గొప్పగా పూజలు చేసింది!
ఊటలు నోట్లో ఊరంగా!
ఉగాది పచ్లడిపెట్టింది!
ఉగాది పండుగ వచ్చింది!
ఊరికి అందం తెచింది!
(డాక్టర వెలగా వెంకటప్పయ్యగారి పిల్లల జానపద సర్వస్వంలో దొరికిన ఉగాది పాట)
Promoted Content