చీకటి దుప్పటిని కప్పుకుని కనురెప్పలపై కలలను పరుచుకుని కంటినిండా నిదురపోయి ఎంత కాలమైంది? కలతనిద్రేకాని కంటికి కమ్మగా కునుకురాదే? అంటూ చాలామంది నిద్రలేమితో బాధపడుతుంటారు. నిద్ర అలసటను దూరం చేసే అనాసిన్. ఒత్తిడిని తగ్గించే క్రోసిన్. అంటే నిద్రే మందులా మన శరీరాన్ని కాపాడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే చేటు చేసే ఎన్నో రోగాలకు కారణం నిద్రలేమి.
నిద్రపట్టక పోవడానికి ఎన్ని కారణాలున్నా అందులో ప్రధానమైనది మానసికమైన ఆలోచనలు, ఆందోళనగా ఉండటం, మనసును ప్రశాంతంగా ఉంచుకోలేకపోవటమే. శరీరానికి అవసరమైన శారీరక శ్రమ లేకుండా దానికి తోడుమానసిక వత్తిడి కూడా ఉంటే మంచి నిద్ర మాట ఎలా ఉన్నా అసలు మామూలు నిద్రకూడా పట్టదు. ఇదే నిద్రలేమికి (ఇన్ సోమ్మియా) దారితీస్తుంది. ఒక్క నిద్రలేమి చాలు వందలకొద్దీ అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టడానికి. అందుకే అనారోగ్యం పాలుచేసే వాటిలో ప్రధమ శత్రువు నిద్రలేమి అనే విషయాన్ని ఎపుడూ గుర్తుంచుకోవాలి.
ఆహార సూత్రాలు అవసరం
తీసుకునే ఆహారాన్ని బట్టి మనిషి ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు అనేది చాలా వరకు నిజం. అయితే నిద్రలేమికి తీసుకునే ఆహారానికి చాలా దగ్గర సంబంధమే ఉంది. సరైన పోషకవిలువలున్న తాజా ఆహారాన్ని తీసుకోవటంతో పాటు ఆ విషయంలో సరైన వేళలు పాటించాలి. అప్పడే ఆరోగ్యం మీ కంట్రోల్ లో ఉంటుంది. రొజూ నిద్రపోయే సమయానికి నిద్ర అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. పోషక విలువలు, విటమిన్లు ఎక్కువగా లభించే తాజా పండ్లు కూరగాయలు, దినుసులు డైట్ లో ప్రధానంగా ఉండేలా చూసుకుంటే చాలా వరకు ఆరోగ్యాన్ని ఆరోగ్యవంతమైన నిద్రను కాపాడుకుంటున్నట్లే లెక్క.
ఆందోళనకు ఆమడదూరం
రాత్రి నిద్రకు మంచంమీద చేరుకున్నాక ఫేనువైపు చూస్తూ ఆరోజు జరిగిన విషయాలను, జీవితంలో జరిగిన బాధ కలిగించే సంఘటనలను మననం చేసుకుంటారు చాలామంది. అంతేకాదు భవిష్యత్తు జీవితం ఎలా ఉంటుందనే బెంగతో నిద్రలేని రాత్రులను గడుపుతారు. రేపు జరగబోయే దానిగురించో, చేయవలసిన పనిగురించో ఇప్పటి నుండి అందోళన చెందటం, పదేపదే నిద్రపోయే ముందు అదే ఆలోచించటం నెమ్మదిగా ఒక ఆలవాటుగా మారిపోతుంటుంది. ఇదే నిశ్చింతగా రావాల్సిన నిద్రను దూరంగా తరిమేస్తుంది. అందుకే ఒక్కసారి మంచంపై వాలాక మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి ప్రయత్నించాలి. అందోళనను పెంచే ఎటువంటి ఆలోచనలు బుర్రలోనికి రానీయకుండా హాయిగా రెప్పలు వార్చాలి.
నిండైన శ్వాస
హాయైన నిద్రకు ఈ చిన్న చిట్కా అనుసరించి చూడండి. రోజూ నిద్రకుపక్రమించే ముందు శ్వాసను దీర్ఘంగా లోపలికి తీసుకోవటం, నెమ్మదిగా వదలటం ఇలా వీలయినన్నిసార్లు ప్రత్యేక శ్రద్ధతో దీర్ఘశ్వాసను తీసుకోవడానికి ప్రయత్నిస్తే చక్కటి వ్యాయామం పూర్తి కావడమే కాకుండా చిక్కని నిద్ర కూడా ఆవరిస్తుంది. ఇలా రోజూ చేస్తే శ్వాసక్రియ పనితీరు కూడా ఎంతో మెరుగు పడుతుంది. ఇలా చేసే సమయంలో పూర్తి ఏకాగ్రతను శ్వాసపైనే ఉంచాలని మరువకండి. రోజూ ప్రయత్తిస్తుంటే ఇది సులభంగా సాధ్యం అవుతుంది.
వ్యాయామం, నడక
ఇక ఆరోగ్యానికి ఎంతో ఉపకరించే వ్యాయామం, నడక సంపూర్ణమైన నిద్రను అందించడంలో కూడా ముందుంటాయి. ఎందుకంటే వాటివల్ల శరీరానికి కావలసిన అలసట అందుతుంది. అలసిపోయిన శరీరంపై రాసిన్ని వేడినీళ్లు పడ్డాయంటే ఇక అది కోరుకునేది హాయైన నిద్రనే. అందుకే సాయంత్రం పూట కాస్త వ్యాయామం చేయటం లేదా వాకింగ్ కు వెళ్లటం చేస్తే భోజనం చేసిన తరువాత చక్కటి నిద్రకు మీకు లోటుండదు.
అనుకూలమైన వాతావరణం
పైన చెప్పిన విషయాలన్నింటికి చక్కని తోడ్పాటు అందించేది చక్కటి వాతావరణం. మీ ఇష్టాయిష్ణాలను బట్టి మీరు నిద్రించే రూమును అలంకరించుకోవాలి. అక్కడ మీరు బాగా ఇష్టపడే వాతావరణాన్ని మీరే సృష్టించుకోవాలి. లైట్ గా ప్రశాంతంగా ఉండే రంగు, మంచి మంచి ఆహ్లాదాన్ని పంచే కొటేషన్స్, సీనరీస్ వంటి వాటితో గదిరూపురేఖలు మార్చుకోవాలి. ఇక మీరు సంగీత ప్రియులైతే హద్దేలేదు. మంచి వినసొంపైన సంగీతాన్ని పెట్టుకుంటే తెలియకుండానే నిద్రలోకి జారుకునేంత ప్రశాంత వాతావరణం మీ చెంత చేరుతుంది.
కుటుంబంలో సత్సంబంధాలు
ఉండే ప్రదేశం అది కుటుంబం కావచ్చు, వేరే ప్రత్యేక కొత్త ప్రదేశం కావచ్చు. మనుషులతో సత్సంబంధాలు ఉండటం ప్రధానం. లేదంటే ఆ గందరగోళం కూడా ప్రశాంతమైన నిద్రకు భంగం చేకూరుస్తుంది. బాగా అలసిపోయి ఇంటికి వచ్చిన వారికి ఆ వ్యతిరేక వాతావరణంలో వినిపించే సూటిపోటి మాటలు, ఎడ, పెడ మొహాలు మనసుకు హాయిని లేకుండా చేస్తాయి. ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించిన సమయంలో పదేపదే గుర్తుకోస్తూ మనసును తొలుస్తుంటాయి. నిద్రపోవటానికి పెద్ద ఆటంకంగా తయారవుతాయి. ఉండే చోటులో ప్రశాంతత కోసం చుట్టు ఉన్న మనుషులతో సత్సంబంధాలు కూడా ముఖ్యమే. చక్కటి నిద్రకు అన్నింటికంటే ప్రధానమార్గం యోగా చేయటం. ఇందులో ముఖ్యంగా కొన్ని సూత్రాలు తెలుసుకొని ప్రతిరోజూ సాధన చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
పై సంగతులతోపాటు ఇలా కూడా ప్రయత్నించి చూడండి:
- అ గోరు వెచ్చని నీటిలో ఉడుకులోన్ కాని, లావెండర్ కానీ అయిదు చుక్కలు కలిపి స్నానం చేస్తే నిద్ర వస్తుంది.
- అ కొబ్బరినూనె వేడిచేసి గోరువెచ్చగా ఉన్నపుడు తలకు మర్ధనా చేసుకుంటే కాసేపటికే పండంటి నిద్ర రావడం ఖాయం.
- అస్సలు నిద్ర పట్టకపోతే ఒక గ్లాసు చన్నీళ్లలో ఒక స్పూను పంచదార వేసి కలిపి తాగండి. హాయైన నిద్ర వస్తుంది. అయితే ఇది రోజూ కాదు ఎప్పడైనా మరీ నిద్ర పట్టనపుడే చేయాలి.
- ఒక చెంచాడు నువ్వులనూనె వేడిచేసి అందులో కొంచెం కర్పూరం కలిపి అరికాళ్లకు మసాజ్ చేసుకున్నా చక్కటి నిద్ర వస్తుంది.
- మనసుకు నచ్చిన చక్కటి సంగీతం వినటం వల్ల, మంచి పుస్తకాలు చదవటం వల్ల మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది.
- మనసు ప్రశాంతంగా ఉంటే నిద్ర దానంతటదే వస్తుంది. అరకపు ఆవుపాలు తాగినా చక్కని నిద్ర మీ చెంత చేరుతుంది.
మధ్యాన్నం నిద్ర మంచిది కాదా? | Is Afternoon Nap Good For Health in Telugu
It is very very good to know new things to those who do not know.