ఈరోజు ఉండ్రాళ్ళతద్ది | Undarallu Tadhi in Telugu

0
6606
undrallu-guggillu-hariome
Undarallu Tadhi in Telugu

ఉండ్రాళ్ళతద్ది / Undarallu Tadhi

భాద్రపద మాసంలోని బహుళపక్ష తదియ ‘ఉండ్రాళ్ళతద్ది’. ఈనాడు మహిళలు ఆచరించే నోముకే – ‘ఉండ్రాళ్ళతద్ది నోము అనీ, పదహారు కుడుములతద్ది వ్రతం అనీ పేర్లు. ఈ వ్రతాన్ని గురించి పూర్వం లయకారుడైన పరమశివుడు పార్వతీదేవికి వివరించినట్లు కథనం. ఐదు సంవత్సరాలపాటు ‘ఉంద్రాళ్ళతద్ది వ్రతం’ ఆచరించి ఉద్యాపన చేయాలని శాస్త్రవచనం.

కన్యలకు నుంచి భర్త లభించేలా చేయడంతోపాటు… వివాహమైన మహిళలకు జీవితాంతం ఐదవతనాన్నీ దాంపత్య సుఖాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన పండుగ“ఉండ్రాళ్ళతద్ది”.

భాద్రపద మాసంలోని బహుళపక్ష తదియ ‘ఉండ్రాళ్ళతద్ది. ఈనాడు మహిళలు ఆచరించే నోముకే – ‘ఉండ్రాళ్ళతద్ది నోము అనీ, పదహారు కుడుములతద్ది వ్రతంఅనీ పేర్లు. ఈ వ్రతాన్ని గురించి పూర్వం లయకారుడైన పరమశివుడు పార్వతీదేవికి వివ రించినట్లు కథనం.

అంతేకాకుండా పూర్వం కన్యగావున్న పార్వతీదేవి  శివుడిని భర్తగాకోరి ఈ వ్రతం ఆచరించి శివుడిని భర్తగా పొందినట్లు పురాణాల్లో చెప్పబడింది.

Back

1. ఈ వ్రతం ఆచరణలోనికి రావడం వెనుక ఆసక్తికరమైన గాథ ఒకటి ప్రచారంలో వుంది.

పూర్వం ఒకవేశ్య శ్రీమంతులను చేరదీసి. వారినుంచి సంపదలను పొంది హీనమైన జీవితం గడుపుతూ వుండేది. చివరకు ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజుకూడా ఆమె సౌందర్యానికి మోహితుడై ఆమెకు వశుడయ్యాడు. దీనితో ఆమె ఐశ్వర్యానికి లోటులేకుండాపోయింది.

ఇలా జరుగుతూవున్న సమయంలో ఒకరోజు మహిళలు ఉండ్రాళ్ళతద్ది వ్రతం చేయడం చూసిన కొందరు వ్రతాన్ని ఆచరించమని వేశ్యకు సలహా యిచ్చారు. సంపదలతో  కళ్ళుమూసుకు పోయిన… దేవుడంటే నమ్మకం లేకుండాపోయిన వేశ్య వ్రతం చేసేందుకు నిరాకరించడంతోపాటు చేస్తూ  వున్నవారినికూడా ఎద్దేవా చేసింది.

దీనీతో కొన్నిరోజులకే ఆమె సంపదంతా నశించిపోయింది. సౌందర్యం తగ్గిపోయింది. రాజూ దూరమయ్యాడు. వీటన్నింటివల్ల బాధకు, దుఃఖానికి లోనైనఆమె అనేక రకాలైన ఆలోచనలుచేసి చివరకు మహర్షుల వద్దకు

వెళ్ళి జరిగిన విషయాన్నంతా వివరించి తనకు మార్గాన్ని సూచించమని ప్రార్థించింది.  “నీవు ఉండ్రాళ్ళతద్దిని గురించి తెలిసీ చేయకపోవడంవల్ల నీకు ఇలాంటిస్థితి ఏర్పడింది. కనుక నీవు ఈసారి వ్రతాన్ని ఆచరించు.” అని సలహాయిచ్చారు మహర్షులు. మహర్షులు సలహామేరకు ఆమె వ్రతాన్ని ఆచరించింది.

ఆమెలో భక్తిభావం వృద్ధిచెందింది. పశ్చాత్తాపం మొదలై వేశ్యా వృత్తి తప్పుఅని తెలుసుకుంది.

జీవితాన్నంతా పవిత్రంగా భక్తిభావంతో గడపడంతోపాటు ఆమె అందరికీ ఉండ్రాళ్ళతద్దిని గురించి తెలిపి ఆచరింపజేసినట్లు కథనం.

అప్పటినుంచి ఈ వ్రతం ఆచరణలోనికి వచ్చినట్లు చెప్ప బడుతోంది.

Promoted Content
Back

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here