సకల రోగాల నివారణకు ఆముదం చెట్టు

0
6579

received_1016091351816886

 

అందరికి ఉపయోగపడే అద్బుత చెట్టు – ఆముదపు చెట్టు.
దీనిని సంస్కృతంలో ఎరండ , పంచాంగుల, వర్ధమాన అని అంటారు.
రూప , గుణ ప్రభావాలు –
ఆముదం చెట్లలో ఎర్రముదాల చెట్టు, తెల్లముదాల చెట్టు రెండు రకాలు ఉంటాయి. తెల్లాముధం చెట్లలో పెద్ద గింజలు కాచేది ఒకటి, చిన్న గింజలు కాచే చిట్టా ముదం ఒకటి ఉంటాయి. తెల్ల ఆముదం చెట్టు కన్నా ఎర్ర ఆముదం చెట్టుకి అధిక గుణగణాలు ఉంటాయి.
ఇది పక్షవాతం మొదలయిన సమస్తవాతాలను , అజీర్ణ రోగములను ఇంకా శరీరంలోని సమస్త అవయవాలలో వచ్చే అనేక వ్యాధులను పోగొడుతుంది . దీని ఉపయొగాలు మీకు వివరిస్తాను.
పక్షవాతం , మలబద్ధకమునకు –
ఆముదపు గింజలు 100 గ్రా తీసుకుని పగలగొట్టి పైన బెరడు తీసివేయాలి ఎందుకంటే గింజల యెక్క పై బెరడు లో విషపూరిత పదార్దాలు ఎక్కువుగా ఉంటాయి. లొపల తెల్లగా ఉండే పప్పుని మెత్తగా నూరి గిన్నేలోవేసి నాలుగు రెట్లు ఆవుపాలు పోసి కోవా లాగా మారేంత వరకు ఉడికించాలి. తరువాత అందులో 100 గ్రా చక్కెర వేసి చిన్న మంటపైన మరిగిస్తూ పదార్ధమంతా హల్వా ( లేహ్యం ) లాగా అయిన తరువాత దించి నిలువ ఉంచుకొవాలి.
రొజూ రెండు పూటలా ఆహారానికి గంట ముందు 5 గ్రా నుండి 10 గ్రా మోతాదుగా ఈ హల్వా ని తింటూ ఉంటే అన్ని రకాల వాతరోగాలు , మలబద్దకం , పక్షవాతం హరించి పొతాయి.
ఈ మందు వాడే సమయాన వాత , కఫం కలిగించే పదార్దాలు నిషేధం .
పిల్లల కడుపులో పురుగులు ఉంటే –
ఆముదపు ఆకుని ముక్కలుగా చేసి బిడ్డల గుద స్థానం నందు రెండు మూడు సార్లు ఆకులతో రుద్దితే కడుపులో పురుగులు అన్ని మల ద్వారం గుండా బయటకు వస్తాయి.
మూల వ్యాధి ని నిర్మూలించుటకు –
లేత ఆముదపు ఆకులను , ఒక ముద్ద కర్పూరం బిళ్ళను కలిపి మెత్తగా నూరి ఆసనానికి కట్టు కడుతూ ఉంటే మూలవ్యాధి తొలగిపోతుంది.
బహిష్టు ఆగిన స్త్రీలకు –
ఆముదపు ఆకును కొంచం నలగగొట్టి వేడిచెసి గోరువెచ్చగా పొత్తికడుపు పైన పరచి గుడ్డతో కట్టుకట్టి రాత్రి నుండి ఉదయం దాక ఉంచుతూ ఉంటే రుతుబద్ధం హరించిపొయి బహిష్టు వస్తుంది.
పురుషాంగ బలహీనతకు –
ఆముదపు పప్పు పైన బెరడు తీసినవి 100 గ్రా , మంచి నువ్వుల నూనె 100 గ్రా ఈ రెండింటిని కలిపి చిన్న మంటపైన పప్పు మాడిపోయే వరకు మరిగించి దించి వడపోసి నిలువ చేసుకోవాలి .రోజు నిద్రించే ముందు 5 నుండి 10 చుక్కల నూనెని పురుషాంగం పైన మృదువుగా ఇంకిపోయే వరకు రుద్ది ఉదయం స్నానం చేస్తూ ఉంటే క్రమంగా అంగ బలహీనత తగ్గిపొయి పురుషాంగానికి పూర్తి బలం చేకూరుతుంది .
కీళ్ల నొప్పులకు –
ఆముదపు ఆకులకు నువ్వుల నూనె పూసి , ఆకులను వెచ్చ చేసి వేడివేడిగా కీళ్ల పైన వేసి కట్టు కడుతూ ఉంటే కీళ్ల వాపులు , నొప్పులు తగ్గుతాయి
అలాగే ఆముదపు పప్పుని మెత్తగా నూరి వేడిచేసి గోరువెచ్చగా ఆ ముద్దను కీళ్ల పైన వేసి కట్టు కడుతూ ఉంటే కీళ్ల మంటలు తగ్గిపోతాయి .
దురదలు తగ్గుటకు –
ఆముదపు గింజలు పగలగొట్టి పై బెరడు తీసివేసి లొపలి పప్పుని పెరుగులో వేసి ఒకరొజు నానబెట్టి మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని దురదల పైన లేపనం చేస్తూ ఉంటే వారం రోజుల్లో కటినమైన దురదలు కనిపించకుండా పొతాయి.
ఆముదపు చెట్టు వేరుని మంచి నీటితో సాన రాయి పైన ఆరగ దీసి ఆ గంధాన్ని కురుపుల పైన లేపనం చేస్తూ ఉంటే అతి త్వరగా కురుపులు , పుండ్లు తగ్గిపోతాయి .
ఆముదపు ఆకుని మెత్తగా దంచి వ్రణాల పైన వేసి కట్టు కడుతూ ఉంటే వ్రణాలు మాడిపోతాయి.
గర్భాశయ వాపు హరించుట కొరకు –
ఆముదపు ఆకు లను శుభ్రముగా కడిగి మెత్తగా నూరి పరిశుభ్రమైన బెత్తెడు వెడల్పు పొడవుగల నూలు బట్టకు పట్టించి ఆ బట్టని వత్తిలాగా చుట్టి దానిని యొని లొపల ఉంచాలి. ఒక గంట తరువాత తీసివేయాలి . ఇలా ఉదయం ఒక వత్తి, సాయంత్రం ఒక వత్తి మార్చి మార్చి పెడుతూ ఉంటే అయిదు ఆరు రొజుల్లొ స్త్రీల గర్భాశయ వాపు తగ్గిపొతుంది.
అనవసర రోమములకు –
పై బెరడు తీసివేసిన ఆముదపు పప్పుని మెత్తగా నూరి వెంట్రుకలను తీసివేసిన చోట రుద్దుతూ ఉంటే వెంట్రుకలు త్వరగా మొలవవు.
సమస్త వాత వ్యాధులకు –
ఆముదపు చెట్టు వేర్లు , శొంటి , దేవదారు చెక్క , సన్న రాష్ట్రం , తిప్ప తీగ , సమ బాగాలుగా తీసుకుని విడివిడిగా ఆరబెట్టి దంచి పొడి చేసుకొవాలి . ఈ మిశ్రమ చూర్ణం 20 గ్రా మోతాదుగా అర లీటరు మంచి నీటిలో వేసి అర పావు లీటరు కషాయం మిగిలేవరకు చిన్న మంటపైన మరిగించి వడపోసి గోరువెచ్చగా రొజూ పరగడుపున సేవిస్తూ ఉంటే క్రమంగా అన్ని వాత రోగాలు అణగారి పొతాయి.
కాలిన పుండ్లకు –
సున్నపుతేట పై నీరు , ఆముదం ఈ రెండు సమంగా ఒక పాత్రలో పోసి గిలకొట్టి అది వెన్నలాగా మారిన తరువాత దాన్ని కాలిన పుండ్ల పైన , బొబ్బల పైన లేపనం చేస్తూ ఉంటే అవి త్వరగా మాడిపోతాయి.
సర్వ విషాల సంహారం –
బాగా ముదిరిన ఆముదపు చెట్టు నుండి విధి పూర్వకముగా పూజ చేసిన తరువాత దాని వేర్లు తవ్వి తీసుకొచ్చి శుభ్రముగా కడిగి చిటికెన వేలు అంత ముక్కలు చేసి నీడలో గాలి తగిలే చోట ఆరబెట్టి నిలువ ఉంచుకోవాలి . మనిషి విష ప్రభావం నకు గురి అయిన సమయంలో వెంటనే ఒక ముక్క ని బుగ్గన పెట్టుకొని నములుతూ ఆ రసం మింగుతూ ఉంటే విష ప్రభావం హరించి పొతుంది..
కాళహస్తి వెంకటేశ్వరరావు


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here