గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu

1
25667

C

Img-034812Gomati-Chakra-1b
గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu

గోమతి చక్రాల ఉపయోగాలు ఏంటో మీకు తెలుసా? | Uses of Gomati Chakra in Telugu

Next

4. ఉపయోగాలు:-

1)ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.

గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడ పోతాయి .

2)రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి, ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు.

రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

3)మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ,కమ్యూనికేషన్,సహాకారం లభిస్తుంది.

మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద అతని పేరు వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే, అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

4)నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది.

గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు.

నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాలనుండి నివారించబడతారు.

5)ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది.

ఐదు గోమతిచక్రాలు పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.

తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

6)ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.

శత్రువులపై విజయం సాదించవచ్చును.కోర్టు గొడవలు ఉండవు.విజయం సాదించవచ్చును.

7)ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి.

7 గోమతిచక్రాలను నదిలో విసర్జితంచేసిన దంపతుల మధ్య అభిప్రాయబేదాలు మటుమాయం అవుతాయి.

8)ఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.

9)తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన మన ఆలోచనలని ఆచరణలో పెట్టవచ్చు.ఆద్యాత్మిక చింతన కలుగుతాయి.

ఆ ఇంటిలోని వ్యక్తులు గౌరవించబడతారు.

10)పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.

ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

11)పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.

12)13 గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

13)27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.

14) జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది.దీనినే నాగదోషం అంటారు.

జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని,దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి.

Promoted Content
Next

1 COMMENT

  1. శ్రీ సుఖన్య గారు నమస్కారము శుబోదయము గోమతి చక్ర్రాలు గురించి చక్క్ గా చెప్పారు ధన్యవాదాములు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here