వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు | Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

0
174
Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates
What are the Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Scheduled Dates 2023?

Vadapalli Sri Venkateswara Swamy Brahmotsavam Dates 2023

1వాడపల్లి వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు 2023

మార్చి-ఏప్రిల్ నెలల్లో వార్షిక వేడుకలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవం పెద్ద ఎత్తున జరుగుతుంది.

వాడపల్లి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన !
వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి !!!

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు – 2023

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతు నామ సంవత్సర ఆశ్వీయుజ పంచమి నుండి ఈ ద్వాదశి వరకు అనగా ది 02-11-2023 గురువారం నుంచి ది. 10-11-2023 శుక్రవారం వరకు జరుగును.

బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామి వారికి జరిగే ముఖ్య కార్యక్రమాలు

ది, 02-11-2023 – గురువారము – “ధ్వజారోహణము”, పరావాసుదేవ అలంకరణతో శేషవాహన సేవ”.

ది. 03-11-2023 – శుక్రవారము – ” గోదావరి నదీజల సంగ్రహణము” “మహాలక్ష్మీ హోమం”. సరస్వతి అలంకరణతో సంస వాహన సేవ”

బి. 04-11-2023 – శనివారము – “మహాపుష్పయాగము”” సహస్రదీపాలంకరణ సేవ”. కోదండరామ అలంకరణతో “హనుమద్వాహన సేవ”.

ది. 05-11-2023 – ఆదివారం – ” శ్రీ శ్రీనివాస కళ్యాణము “. యోగనారసింహ అలంకరణతో సింహవాహన సేవ “.

ది. 06-11-2023 – సోమవారం – “తోమాల సేవ”, “మహాసుదర్శన హోమము”. మలయప్ప అలంకరణతో గరుడ వాహన సేవ”.

ది. 07-11-2023 – మంగళవారం – “అష్టదళపాదపద్మారాధన” ఉదయం- శ్రీకృష్ణ అలంకరణతో” సూర్యప్రభ వాహన సేవ”. రాత్రి మోహినీ అలంకరణతో చంద్రప్రభ వాహన సేవ”.

ది. 08-11-2023 – బుధవారం – “అష్టోత్తర శతకలశాభిషేకము”. “లక్షతులసి పూజ”, “లక్ష్మీ వేంకటేశ్వర మూలమంత్ర పూర్వక వేంకటేశ్వర హోమము”. రాజాధిరాజ అలంకరణతో గజవాహన సేవ.

ది 09-11-2023 – గురువారం – “తిరుప్పావడ సేవ” చూర్ణోత్సవము”. కల్కి అలంకరణతో “అశ్వవాహన సేవ “.

ది. 10-11-2023 – శుక్రవారం – “మహాపూర్ణాహతి”. ” చక్రస్నానం”. ” ద్వజావరోహణ ” ” ఏకాంత సేవ”.

మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back