వడ్డికాసులవాడు అన్న పేరులోని అర్థం, పరమార్థం

0
5035

vaddi-kasula-vadu-meaning-hariome

చాలామంది భక్తులు కష్టాలు చుట్టుముట్టినప్పడు తమను కాపాడవలసిందిగా తిరుమలేశుని ప్రార్ధించి మొక్కుకుంటారు. ఆపదలనుండి బయటపడిన వెంటనే తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లిస్తామని మరీమరీ ప్రార్థిస్తారు. శ్రీనివాసుడు తన భక్తులను కరుణించి వారి వారి కష్టాలను మటుమాయం చేస్తాడు. కానీ లబ్దిపొందిన భకులు సకాలంలో మొక్కులు చెల్లించకుండా తాత్సారం చేస్తూ, తిరుమల ప్రయాణాన్ని ఎప్పటికప్పడు వాయిదా వేసూంటారు. అందుకు ఏవేవో కారణాలను ఏకరువుపెడుతూ ఆ దేవుడిని క్షమించమని, సాధ్యమైనంత త్వరలో తిరుమలకు వచ్చి మొక్కుబడులను వడ్డీతో సహా చెల్లించుకుంటామని మరల మరల మొక్కుకుంటూనే ఉంటారు. చిద్విలాసుడైన శేషాచలపతి భక్తులను అన్నివిధాలా గమనిస్తూ వారి నుండి మొక్కు బడులను వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు.

ఇందులోని అంతరార్థం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సకాలంలో తన పనులను తాను నెరవేర్చుకుంటే తేలికగా ఉంటుంది. తాత్సారం చేసేకొద్దీ శ్రమ పెరుగుతుంది. అసలుకు వడ్డీ అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇది బోధించడానికే శ్రీనివాసుడు వడ్డికాసుల వాడైనాడు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here