వైకుంఠ ఏకాదశి కథ, పరమార్ధం & ఆధ్యాత్మిక స్పూర్తి | Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration

0
456
Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration
What are the Vaikunta Ekadashi Stories & Spiritual Inspiration?

Stories of Vaikuntha Ekadashi, Paramardha & Spiritual Inspiration

2వైకుంఠ ఏకాదశి ఏందుకు జరుపుకుంటాము? పురాణ గాధ (Why Do We Celebrate Vaikuntha Ekadashi? Epic Story)

వైకుంఠ ఏకాదశి మొదటి కథ (Vaikuntha Ekadashi First Story)

వైకుంఠ ఏకాదశి మార్గశిర పుష్య మాసంలో వస్తుంది. దేవతలు త్రేత యుగంలో రావణాసురుడి పెట్టే కష్టాలు తట్టుకోలేక బ్రహ్మ దేవుడు తోడు రాగా శ్రీమన్నారాయునికి మోర పెట్టుకోవడానికి వైకుంఠం చేరుకోని ఉత్తార ద్వారం గుండా లోనికి ప్రవేశించి తమ భాధను విన్నవించుకుంటారు. స్వామి వారు బ్రహ్మాది దేవతలకు అభయ హస్తంతో దర్శనం ఇచ్చి వారి భాధలకు మార్గం చూపిస్తాడు. ఇదంతా జరిగింది వైకుంఠం నందు ఏకాదశి రోజు. అందుకే దీనికి వైకుంఠ ఏకాదశి అని పేరు వచ్చింది.

రెండవ కథ (మోక్ష ఏకాదశి అనే పేరు ఏలా వచ్చింది?) (How Did the Name Moksha Ekadashi Come About?)

మధుకైటభులు అనే రాక్షసులను శ్రీమన్నారాయుడు సంహరించగానే వారి పాపాలు పోయి దివ్యజ్ణానాన్ని పొంది ఒక వరం కోరుకుంటారు. “స్వామి, వైకుంఠం లాంటి ఒక మందిరం నిర్మిస్తాము. వైకుంఠ ఏకాదశి రోజు మీ ఆలయంలోకి ఏ భక్తులైతే ఉత్తర ప్రవేశ ద్వారం నుంచి ప్రవేశించి మిమ్మల్ని దర్శించి ఏకాదశి పూజ చేస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి అనుగ్రహించండి అని కోరుకుంటారు. శ్రివారు వార్కి కోరికకు సంతషించి తధాస్తు అని అంటాడు. వైకుంఠ ఏకాదశి రోజె మధుకైటభులకు మోక్షం వచ్చింది కాబట్టి మోక్ష లేద మోక్షోత్సవ ఏకాదశి అని కూడ పిలుస్తారు. మరిన్ని వివరాల కోసం పక్క పేజ్ కి వెళ్ళండి.