ఈ రోజు – వసంత పంచమి, శ్రీపంచమి | Vasantha Panchami in Telugu

1
16479
Vasantha Panchami
ఈ రోజు – వసంత పంచమి, శ్రీపంచమి | Vasantha Panchami in Telugu

       సరస్వతీ నమస్తుభ్యం వరదే కామ రూపిణి

విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరవర్ణినీ

నిత్యం పద్మాలయాదేవీ సామాం పాతు సరస్వతీ.

ఈ శ్లోకమే మనకు చదువు నేర్చుకునే మొదటి అడుగు. హిందూ ధర్మం లో చదువుకున్న వారు, చదువుకోనివారు అనే భేదం లేకుండా అందరికీ ఈ సరస్వతీ ప్రార్థన కంఠతా వస్తుంది. సకల విద్యలకూ కళలకూ అధిదేవత సరస్వతీదేవి. ఆమె కటాక్షం పొందటానికి విద్యార్థులు, ఉద్యోగస్తులు,కళాకారులు ఎంతగానో ప్రయత్నిస్తారు. శ్వేతాంబరధారిణి, వీణా పాణి అయిన అమ్మవారికి ప్రతి సంవత్సరం మాఘ శుక్ల పంచమి నాడు వసంత పంచమి జరుపుకుంటాం.  ప్రకృతిలోనూ ప్రజల్లోనూ వసంత కళ ప్రతిబింబిస్తుంది. దీనికి ప్రతీకగా యువతులు రంగురంగుల వస్త్రాలను ధరించి కృష్ణుని ఆరాధిస్తూ రాసనృత్యం చేస్తారు. ఇది ఉత్తర భారతదేశం లో ఎక్కువ ప్రచారం లో ఉన్న సాంప్రదాయం. కేవలం హిందూ ధర్మం లోనే కాక అనేక సంప్రదాయాలలో వసంత పంచమిని జరుపుకుంటారు.

వసంత మాసం లో వచ్చే పంచమి నాడు జరుపుకుంటాం కాబట్టి ఈ పండగకు ‘వసంత పంచమి’ అన్న పేరు వచ్చింది. వసంత పంచమీకే సరస్వతీ పంచమి, శ్రీపంచమి అన్న పేర్లు ఉన్నాయి. వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని అలంకరించి, అమ్మవారినీ ఆమెకు ప్రతిరూపమైన పుస్తకాలను పెన్నులనూ పూజించాలి. తెల్లని పాయసం, పెరుగన్నం నైవేద్యం గా సమర్పించాలి. కోరిన విద్యలను ప్రసాదించే కొంగుబంగారం సరస్వతీ దేవిని వసంతపంచమి నాడు మనసారా పూజించాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here