
3. పెరిగిన స్థలాల విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
పెరిగిన స్థలముల విషయానికి వస్తే ఈశాన్యం పెరిగిన స్థలమును వెంటనే కొనండి.
తూర్పు పెరగడం మంచిది. కాని ఈశాన్యం కోల్పోతుంది కదా.. ఇటువంటి స్థలముల విషయం లో అనుభవం గల వాస్తు శాస్త్రవేత్త సలహాలను పొందడం చాల మంచిది.
ఆగ్నేయం పెరిగిన స్థలమును ఎటువంటి పరిస్థితులలోను కొనరాదు.దక్షిణ ఆగ్నేయం పెరిగిన స్థలమును కొనవచ్చు. అయితే ఈశాన్యం లో గుంత వుండటం చాల మంచిది. ఉత్తర ఈశాన్య నడక రావడం మరీ మంచిది.
దక్షిణ భాగము పెరిగిన స్థలమును కొనరాదు.
దక్షిణ నైరుతి పెరిగిన స్థలమును కొనరాదు.
నైరుతి పెరిగిన స్థలమును ఎటువంటి పరిస్థితులలోను కొనరాదు.
పశ్చిమ నైరుతి పెరిగిన స్థలమును కొనరాదు. పశ్చిమము పెరిగిన స్థలమును కొనరాదు.
పశ్చిమ వాయువ్యం పెరిగిన స్థలమును కొనవచ్చు. వాయువ్యం పెరిగిన స్థలమును కొనరాదు.
ఉత్తరం పెరగడం చాల మంచిది. అలాగని ఉత్తరం పెరిగిన స్థలమును కొన్నచో ఈశాన్య భాగమును కోల్పోతాము కదా.ఇటువంటి స్థలముల విషయంలో వాస్తు శాస్త్రవేత్త సలహాలను తీసుకోవడం మంచిది.
ఉత్తర ఈశాన్యం పెరిగిన స్థలములను నిరభ్యంతరం గా కొనవచ్చు.ఇటువంటి స్థలములను ఎటువంటి పరిస్థితులలోను వదులుకోవద్దు. తరాల కొద్ది ఐశ్వర్యం నిలుస్తుంది.
నమస్కారం గురువు గారు పాముపుట్ట కూల్చి ఇల్లు కట్టినచో ఎలాంటి పరిహారాలు చేయాలి