వటసావిత్రీవ్రతం, మహాజ్యేష్ఠి, ఏరువాక పూర్ణిమ, వృషభపూజ – జ్యేష్టాభిషేకములు

0
848

14.06.2022 – మంగళవారం – వటసావిత్రీవ్రతం, మహాజ్యేష్ఠి, ఏరువాక పూర్ణిమ, వృషభపూజ – జ్యేష్టాభిషేకములు

జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అమావాస్య-ఈ మూడు రోజులు స్త్రీలు వటసావిత్రీ వ్రతాన్ని ఆచరించాలి. సావిత్రీదేవి యముని ప్రార్థించి తన భర్తను బ్రతికించుకున్న రోజు ఇది. మూడు రోజులు కుదరని వారు పూర్ణిమ నాడు గానీ అమావాస్య నాడైనా దీనిని ఆచరించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుంది.

ఈ రోజున మర్రిచెట్టును పసుపు కుంకుమలతో పూజించి దారానికి పసుపు పూసి ఆ దారాన్ని మర్రిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ చుట్టాలి. ఇలా 108 చుట్లు చుట్టడం విశేష ఫలదాయకం.

ఈ రోజున తిలలు దానం చేసినవారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యం కలుగుతుంది. ఈ పూర్ణిమనాడు గొడుగు, చెప్పులు, ఉదకుంభము, విసన కర్ర దానము చేయడం వలన సద్గతులు, సంపదలు సిద్ధిస్తాయని విష్ణుపురాణ వచనం.

తిరుపతిలో, శ్రీరంగ క్షేత్రంలో ప్రత్యేక అభిషేకములు నిర్వహిస్తారు. అంతే కాక పూరీలో జగన్నాథ, బలభద్ర, సుభద్రాదేవి యొక్క మూర్తులను ప్రత్యేక స్నాన వేదిక వద్దకు తెచ్చి స్నాన యాత్రను నిర్వహిస్తారు.

జ్యేష్ఠ పూర్ణిమ అత్యంత పవిత్రమైన దినం. ఇంటిలో లేదా దేవాలయములలో ఈ రోజున అభి షేకాదులు నిర్వహింపజేయడం శ్రేయోదాయకం.

జ్యేష్ఠ పూర్ణిమ విశిష్ఠత – Jyeshtha pournami Importance in Telugu