విజయ ఏకాదశి వ్రత కథ.. | Vijaya Ekadasi Vratam In Telugu

0
4070

విజయ ఏకాదశి వ్రత కథ..

ఏకాదశి వ్రత కథ..

శ్రీ రామ చంద్రుడు ఆచరించిన విజయ ఏకాదశీ వ్రత కథని పఠించడం వలన ఏకాదశీ వ్రతమాచరించిన పుణ్యం లభిస్తుంది. ఆ వ్రత కథను తెలుసుకుందాం.

శ్రీరాముడు సీతామాతను రావణాసురుని చెరనుంచీ విడిపించడానికి లంకను చేరే సన్నాహాలు చేయనారంభించాడు.  అతి దుర్భేద్యమైన సముద్రాన్ని దాటి ఇంత వానర సైన్యం లంకా పట్టణాన్ని ఎలా చేరుకోవాలా అని ఆంజనేయునితో సహా అందరూ విచారిస్తుండగా లక్ష్మణుడు అక్కడ సమీపంలో నివశిస్తున్న బకదళాభ్యుడనే ఋషి వద్దకు వెళ్ళి సహాయం కొరదామని సలహా ఇస్తాడు. అందుకు అందరూ అంగీకరిస్తారు. ఆ బకాదళాభ్యుడు బ్రహ్మ దేవుని మెప్పించి ప్రత్యక్షం చేసుకున్న మహా తపస్వి. ఆయన శ్రీరాముని చూడగానే శ్రీ మహావిష్ణువు ఏతెంచాడని గ్రహించాడు. విష్ణుని లీలలను తెలుసుకొన్న ఆయన విజయ ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి విజయ ప్రాప్తిని పొందమని రామచంద్రునికి సూచిస్తాడు. రామ చంద్రుడు విజయ ఏకాదశినాడు ఉపవాస దీక్ష పాటించి అందరికీ విజయ ఏకాదశి గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపుతాడు. నాటి వ్రత దీక్షా ఫలితంగా లంకను జయించి రావణుని సంహరించి సీతమ్మను ఆ రాక్షసుని చెరవిడిపించారు.

ఇది ఏకాదశి వ్రత కథ.ఇది స్కాంద పురాణం లోనూ, రామాయణం లోనూ ప్రస్తావించబడింది. ఈ కథను విన్నవారు, చదివినవారు ఇహ లోకం లో కోరిన కోర్కెలు నెరవేరి సర్వదా విజయం సాధించి, జన్మాంతంలో హరి సాన్నిధ్యాన్ని పొందుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here