విజయవాడ దుర్గమ్మ గుడిలో ఇవి రంగులు మారుతున్నాయి? ఇది దేనికి సంకేతం?!

0
1252
vijawada durgamma temple
Vijawada Durgamma Temple Updated News

Kalashala Changing Colors of Durgamma Temple in Vijayawada

1విజయవాడ దుర్గమ్మ గుడిలో రంగులు మారుతున్న కలశాలు

విజయవాడ కనక దుర్గ ఆలయంలో ప్రతి అణువు ఆ అమ్మవారి ఆస్థి. ఇంద్రకీలాద్రిని గుర్తుచేసుకుంటే అందరికి గుర్తొచ్చేది ఆలయం పైన ఉన్న రాజ గోపురం. ఈ రాజా గోపురాన్ని ఎంతో శ్రద్దతో, భక్తితో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అలాంటిది ఇప్పుడు ఈ ఆలయంపై ఉన్న కలశల రంగు నల్లగా మారిపోవడంతో వివాదంగా మారింది. ఈ రాజ గోపురం ఏర్పాటు చేసి 8 సంవత్సరాలు అవుతుంది.ఈ రాజా గోపురం పైన భారీ కలశాలను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో భక్తులు నుండి కూడా పెద్ద సంఖ్యలోనే విరాళాలు కూడ వసూలు చేశారు. కాని ఇప్పుడేమొ రంగు మారడం ఏంటి అంటూ ఎన్నో విమర్శలు వస్తున్నాయి.

అదే కనక దుర్గ దేవాలయంలో ఉన్న ప్రధాన ఆలయం ఘాట్ రోడ్డు వైపు ఉన్న ప్రవేశ మార్గం దగ్గర ఉన్న గోపురం పైన 20 సంవత్సరాల క్రితం కలశాలు ఏర్పాటు చేశారు. అయిన కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా బంగారు వర్ణంతో విరాజిల్లుతుంది. మరి రాజగోపురంపై కొత్తగా ఏర్పాటు చేసిన కలశాలు 8 సంవత్సరాలకే రంగు ఎలా మారాయి అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనక దుర్గ గుడిలో 50 కోట్ల వ్యయంతో రాజ గోపురాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దానికి సంబంధించిన పనులు నిర్మాణం దాదాపుగా 10 సంవత్సాల వరకు కొనసాగాయి. ఇన్ని సంవత్సరాలు పనులు చేసినప్పటికి ఇలా ఎందుకు అయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ది చేందిన ఆలయానికి కలశాలు నాణ్యత లోపం ఎందుకు వచ్చింది. ఇలాంటి నాణ్యత లోపంకి సంబంధించినవి చేయడానికే దశాబ్దాల కాలం పట్టిందా?

Back