Vijayawada
విజయవాడ | Vijayawada

విజయవాడ | Vijayawada

దుర్గమాసురుడు, మహిషాసురుడు మొదలైన రాక్షసులను సంహరించిన పార్వతీదేవి “దుర్గ”గా సర్వదేవ పూజితయై ఇంద్ర కీలాద్రియందు కొలువుదీరింది.

అమ్మతోపాటు పరమేశ్వరుడు కూడా మల్లేశ్వర/మల్లికార్డున స్వామిగా కొలువుదీరాడు. దర్శనమాత్రముచేతనే సర్వపాపములను పటాపంచలుచేయు తల్లిని తనయందే వసింపుమని ఇంద్రకీలాద్రి కోరగా ఆ తల్లికి నివాసమైన కొండను కనకాద్రియనికూడా పిలిచెడివారట. మహిషాసురుని దుర్గ జయించుటచే యీ ప్రాంతము తొలుత జయపురిగా పిలువబడెను. మహాభారత కాలంలో (ద్వాపరయుగం) పాండవులు అరణ్యవాసం చేయుచుండగా శ్రీకృష్ణుని ఆదేశంమేరకు అర్జునుడు దివ్యాస్త సంపాదన నిమిత్తం యీ కొండపైననే తపమాచరించెనట. ఈ చరిత్రను స్కాందపురాణం యిలా తెలియజేస్తోంది –

శ్లో: తతః పశ్చాదర్శనశ్చాపి తపస్తప్త్వాతు ఫల్గునః |

మల్లికేశ్వరదేవాశ్చ, లబ్దావపాశుపతం ధనుః

స్తుతించక్రేతతఃపశ్చాత్ విజయాహి పురీహ్యభూత్||

అనంతరం అర్జునుడు తపస్సుచేసి మల్లికేశ్వరుని అనుగ్రహంతో పాశుపతాస్తాన్ని పొందాడు. అప్పటినుండి యీ ప్రాంతం విజయపురిగా పిలువబడుతోంది.

సర్వదేవతలకు నివాసమైన యీ కొండ ఇంద్రకీలాద్రి అను పేరుతో నృసింహస్వామి నివాసమైన మంగళగిరి వరకు వ్యాపించెనట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here