విష్ణు సహస్రనామము పారాయణ విధి విధానం | Vishnu Sahasranama Parayanam Vidhanam in Telugu

0
15039

 

2
విష్ణు సహస్రనామము పారాయణ విధి విధానం | Vishnu Sahasranama Parayanam Vidhanam in Telugu

సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. ఇది అందరూ చేయవచ్చు. ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి.

కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు.

ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. నామము అందరూ చెప్పవచ్చు.

మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు.

అందుకని రాత్రి నిద్రపోయేముందు పదకొండు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు.

అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ పదకొండు మార్లు చెప్పి లేవాలి.
శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు.

ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. గజేంద్ర మోక్ష ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి.

కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.

దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్!
కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!

విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది.

శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే.

అది సంజీవనీ ఓషధి వంటిది. కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు.

భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్ర నామ స్తోత్రం. ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది.

విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించే దీపపు కాంతి సమస్త ప్రాణికోటిని ఉద్ధరిస్తుంది. భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి.

కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 108 రక్షణ హేతువు.
గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108.

పూజకు సమయంలేనప్పుడు కేశవ, మాధవ, నారాయణ, గోవింద, మధుసూదన, విష్ణు, త్రివిక్రమ. వామన, శ్రీధర, హృషీకేశ, పద్మనాభ, దామోదర అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది.

అలా అని ఆలస్యంగా లేవమని కాదు. ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు.
గణపతికి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజ కర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిపః ధూమ్ర కేతుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణ: హేరంబః స్కంద పూర్వజః అనే పదహారు నామాలతో, పరమేశ్వరునికి భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతై దేవాయ నమః, అని ఎనిమిది నామాలతో, అమ్మవారికి భవస్య దేవస్య పత్న్యై నమః, శర్వాయ దేవస్య పత్న్యై నమః ఈశానాయ దేవస్య పత్న్యై నమః పశుపతే దేవస్య పత్న్యై నమః రుద్రాయ దేవస్య పత్న్యై నమః ఉగ్రాయ దేవస్య పత్న్యై నమః భీమాయ దేవస్య పత్న్యై నమః మహతై దేవస్య పత్న్యై నమః చేయాలి. వారి పిల్లలకి కూడా చేయాలి అనుకుంటే భవస్య దేవస్య పుత్రై నమః అని చేయాలి.
భూరంభాంస్యనలోనిలోంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్!!

అన్నారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here