విష్ణుక్రాన్త పత్రం | vishnukranta patram
భిన్నదంతాయ నమః విష్ణుక్రాన్త పత్రం సమర్పయామి
దీనికి సంస్కృతంలో శంఖ పుష్పి, సుపత్ర, అపరాజిత అని పర్యాయనామాలు కలవు. దీని శాస్త్రీయ నామము convolvulus pluricaulis, కుటుంబం- Convolvulaceae. ఇది రేగటి నేలలో పెరిగే చిన్న మొక్క, ఇది నీలి మరియు తెలుపు పుష్పములు కలిగియుంటుంది. నీలి పుష్పములు కలిగినది విష్ణుక్రాస్త్రము. రెండింటి గుణములు ఒకే విధంగా ఉంటాయి. ఇది వర్ష ఋతువులో మొలకెత్తి వసంత ఋతువు వరకు ఉంటుంది. దీని శాఖలు భూమిపైన అన్ని వైపుల కిరణాలవలె వ్యాపిస్తాయి. ఇది మంచి దృష్టి, కంఠస్వరము మరియు ధారణా శక్తి (జ్ఞాపకశక్తి)ని కలిగిస్తుంది. ఇది మూత్ర దోషములు మరియు కుష్టువ్యాధి యందు హితము. ఇది దేవతా విగ్రహ ప్రతిష్ణా సంభార ములలో మహౌషధి గణములలో ఒకటి.
vishnukranta patram