అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోతున్న మన హిందువు వివేక్ రామస్వామినే టాప్! | USA President Elections 2024

0
153
Vivek Ramaswamy in USA President 2024 Race
India Hindu Origin Vivek Ramaswamy in USA President 2024 Race

Vivek Ramaswamy in USA President 2024 Race

1అమెరికా అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి

అమెరికా దేశంలోని రిపబ్లికన్లలో అధ్యక్ష పదవి అభ్యర్థులకు సంబంధించి అత్యంత పాపులర్ నాయకుల్లో 2వ వ్యక్తిగా భారతీయ దేశానికి చెందిన పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి గారు నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా డెమొక్రాటిక్ పార్టీ మరియు రిపబ్లికన్ పార్టీలు పోటీ పడుతుంటాయి. అయితే, అక్కడ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపిక కూడా ఆ పార్టీల్లో అత్యంత కష్టంగా ఉంటుంది. మొదటగా ఆ పార్టీల్లోని నేతలు ఎవరెవరు ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పద్ధతులను అనుసరించి ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఒక వ్యక్తిని వారి ఎంపిక చేస్తారు. రిపబ్లికన్ పార్టీ తరఫున రానున్న 2024 ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు సౌత్ కరొలినా మాజీ గవర్నర్, ఐక్య రాజ్య సమితిలో గతంలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. తాజా విషయం ఏమిటంటే మన వివేక్ రామస్వామి గారు కూడా ఆ బరిలో ఉండబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. అయితే మనం ఇక్కడ వివేక్ రామస్వామి గురించిన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back