About chhatrasal in Telugu పన్నా మహారాజు చంపత్ రాయి కుమారుడు ఛత్రసాలుడు దుర్గమ పర్వతారణ్య ప్రాంతం లో 1706 సంవత్సరం లో జన్మించాడు.
తన 13వ ఏడే తండ్రి స్వర్గస్తుడైనాడు. పినతండ్రి సుజాన్ రాయి ఎంతో మెలుకువ తో అతనికి సైనిక శిక్షణ ఇప్పించాడు. తండ్రి వలె కుమారుడుకి కూడా అమిత శౌర్య సాహసాలు సంక్రమించాయి.

ఒక సారీ బాలుడైన ఛత్రసాలుడు తన తోటి రాజపుత్ర స్నేహితులతో వింధ్యవాహిని మందిరానికి అమ్మవారి దర్శనార్ధం వెళ్ళాడు.
చేతులు, కాళ్ళు కడుక్కొని అమ్మవారి పూజ కోసం పువ్వులను అక్కడ ఉన్న తోట లో కోస్తూ కొంచెం దూరం వెళ్ళగా, అక్కడికి ఒక ముసల్మాను సైనికుడు వచ్చి ఇలా అడిగాడు – ” వింధ్యవాసినిదేవి మందిరం ఎక్కడ?”, అందుకు ఛత్రసాలుడు అనుమానం తో అడిగాడు ” నీకెందుకు? దేవి పూజ చేస్తావ?”..అందుకు ఆ ముసల్మాను సైనికుడు కోపం తో ” ఛి ఛి..
మేము మందిరాన్ని ధ్వంసం చేయటానికి వచ్చాము”…ఇది వినగానే ఛత్రసాలుడు ఇలా అన్నాడు ” ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడు..
మళ్ళి ఆ మాట అన్నావంటే నీ నాలుక చీరేస్తాను”. దానికి ఆ ముసల్మాను సైనికుడు నవ్వి ఇలా అన్నాడు – “మేము ఔరంగజేబు సైనికులము నీవేమి చేయగలవు? నీ దేవి…..” ఆ మాట పూర్తికాకముందే అతని రొమ్ము దగ్గర కత్తి దిగింది, యుద్ధం మొదలైంది. అక్కడ ఉన్న రాజపుత్రుల బాలలు తమ కత్తుల ఓర నుండి కత్తులు తీసి శత్రు సైన్యం మీద దాడికి దిగారు, మందిరంలో యుద్ధవార్త తెలుసుకున్న మహారాజు సుజాన్ రాయి తన సైన్యం తో అక్కడికు వచ్చేవరకు ఛత్రసాలుడు తన స్నేహితుల తో శత్రు సైన్యాన్ని చాల వరకు హతమార్చాడు, కొంత మంది ప్రాణాలను దక్కించుకొని భయం తో పారిపోయారు.
జరిగినదంతా తెలుసుకున్న మహారాజు ఆ వీర బాలుడిని ప్రేమ తో హత్తుకున్నాడు. తన సోదరుడి కుమారుడి వీరత్వం చూసి ఆనందం తో పులకించిపోయాడు.
భగవతి వింధ్యవాసిని దేవి తన ప్రియమైన భక్తుడి శౌర్య కుసుమార్చనతో ప్రసన్నురాలైంది